హోసన్ననుచూ స్తుతి పాడుచూ - YouWorship
Hosannanuchu Sthuthi Paaduchu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా|| Hosannanuchu Sthuthi Paaduchu Seeyonuku Cheredam (2) Hosannaa.. Hosannaa.. (2) ||Hosannanuchu|| Ee Lokayaathralo Baatasaarulam Ee Jeevana Kadalilo Paradeshulam (2) Kshana Bhanguram Ee Kshaya Jeevitham Akshaya Nagaram Manaku Shaashwatham (2) ||Hosannaa|| Mannayina Ee Deham Mahima Roopamai Davala Varna Vasthramulu Dhariyinchedamu (2) Naadhudesuku Nava Vadhuvulamu Neethi Paalanalona Yuva Raanulamu (2) ||Hosannaa|| Prathi Baashpa Binduvunu Thudichiveyunu Chinthalanni Theerchi Chentha Niluchunu (2) Aakali Ledu Dappika Ledu Aahaa Mana Yesutho Nithyamaanandam (2) ||Hosannaa||