హే ప్రభుయేసు - YouWorship
Hey Prabhu Yesu
Artist: ఏ బి మాసిలామణి
Category: Praise
Song Lyrics
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా (2) మలమల మాడిన మానవ హృదయము (2) కలకలలాడె కదా ||సిల్వధరా|| కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత (2) మానవ మైత్రిని సిల్వ పతాకము (2) దానము జేసెగదా ||సిల్వ ధరా|| దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా (2) దేవునితో సఖ్యంబును జగతికి (2) యీవి నిడితివి గదా ||సిల్వ ధరా|| పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా (2) దాపున జేరి పాపిని బ్రోచిన (2) కాపరి వీవెగదా ||సిల్వ ధరా|| ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా (2) ఖలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా ||సిల్వ ధరా|| కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా (2) కలుష ఎడారిలో కలువలు పూయుట (2) సిలువ విజయము గదా ||సిల్వ ధరా|| Hey Prabhu Yesu – Hey Prabhu Yesu – Hey Prabhu Deva Suthaa Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa ||Hey Prabhu|| Shaanthi Samaadhaanaadhipathi Swaanthamulo Prashaantha Nidhi (2) Shaanthi Swaroopaa, Jeevana Deepaa (2) Shaanthi Suvaartha Nidhi ||Silva Dharaa|| Thapamulu Tharachina Ninne Gadaa Japamulu Golichina Ninne Gadaa (2) Viphalulu Jesina Vignaapanalaku (2) Saphalatha Neeve Gadaa ||Silva Dharaa|| Mathamulu Vedakina Ninne Gadaa Vrathamulu Gorina Ninne Gadaa (2) Pathithulu Devuni Suthulani Nerpina (2) Hithamathi Veeve Gadaa ||Silva Dharaa|| Palukulalo Nee Shaanthi Katha Tholakari Vaanaga Gurise Gadaa (2) Malamala Maadina Maanava Hrudayamu (2) Kalakalalaade Kadaa ||Silva Dharaa|| Kaananathulya Samaajamulo Heenatha Jendenu Maanavatha (2) Maanava Maithrini Silva Pathaakamu (2) Daanamu Jesegadaa ||Silva Dharaa|| Devuni Baasina Lokamulo Chaavuye Kaapuramunde Gadaa (2) Devunitho Sakhyambunu Jagathiki (2) Yeevi Nidithivi Gadaa ||Silva Dharaa|| Paapamu Chesina Sthreeni Gani Paapula Kopamu Made Gadaa (2) Daapuna Jeri Paapini Brochina (2) Kaapari Veeve Gadaa ||Silva Dharaa|| Khaalee Samaadhilo Maranamunu Khaidiga Jesina Neeve Gadaa (2) Khalamayudagu Saathaanuni Garvamu (2) Khandanamaaye Gadaa ||Silva Dharaa|| Kaluvarilo Nee Shaanthi Sudhaa Selayeruga Bravahinche Gadaa (2) Kalusha Edaarilo Kaluvalu Pooyuta (2) Siluva Vijayamu Gadaa ||Silva Dharaa||