హృదయమనెడు తలుపు నొద్ద - YouWorship
Hrudayamanedu Thalupu Nodda
Artist: పులిపాక జగన్నాథము
Category: Gospel
Song Lyrics
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ|| అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ|| జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ|| సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ|| చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ|| అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ|| బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ|| Hrudayamanedu Thalupu Nodda – Yesu Naathundu Nilachi – Sadayudaguchu Dattuchundu – Sakala Vidhamulanu (2) ||Hrudaya|| Paruni Boli Niluchunnaadu – Parikinchi Chooda Nathadu – Parudu Gaadu Rakshakundu – Praana Snehithudu (2) ||Hrudaya|| Karunaa Sheelundathadu Gaana – Gaachi Yunnaadu Yesu – Karuna Nerigi Gaaravimpa – Garamu Nyaayambu (2) ||Hrudaya|| Entha Sepu Niluva Betti – Yedpinthu Rathani Naatha – Dentho Dayache Biluchuchunnaa – Dippudu Mimmulanu (2) ||Hrudaya|| Athadu Mithrudathadu Mithrun – Dakhila Paapulaku Meera – Lathani Pilupu Vinti Reni – Yathadu Priyudagunu (2) ||Hrudaya|| Jaali Chetha Dana Hasthamula – Jaaapi Yunnaadu Mimmu – Naalinganamu Seya Gori – Yanishamu Kanipettu (2) ||Hrudaya|| Saatileni Dayagala Vaadu – Sarveshu Suthudu Thana – Maata Vinedu Vaarala Nella – Sootiga Rakshinchu (2) ||Hrudaya|| Cherchukonudi Mee Hrudayamuna – Shree Yesunaathu Nathadu – Cherchukonuchu Mee Kichchunu – Chira Jeevamu Krupanu (2) ||Hrudaya|| Athadu Thappaka Kalugajeyu – Nakhila Bhaagyamulu Meera – Lathani Haththukondu Rappu – Daanandamu Thoda (2) ||Hrudaya|| Brathuku Shaashwathambu Kaadu – Parikinchu Choodu Gaana – Brathiki Yundu Kaalamunane – Prabhuni Goluvandi (2) ||Hrudaya||