హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద - YouWorship
Hallelooya Sthuthi Prashansa Paadeda
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద (2) 1. సిలువలో నాకై రక్తము కార్చి (2) - నన్ను రక్షించిన ఓ ప్రభువా (2) 2. నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంత కడిగె 3. నీవు గావించిన బలియాగముకై - సాగిలపడి పూజించెదను 4. నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాచితివి 5. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై - నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా 6. యెట్లుండగలను నీ పాట పాడక - పొంది యున్నట్టి మేలులకై 7. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో - ఆరాధించెద నిన్ను ప్రభువా Pallavi: Hallelooya Sthuthi Prashansa Paadeda (2) 1. Siluvalo Naakai Rakthamu Kaarchi (2) - Nannu Rakshinchina O Prabhuvaa (2) 2. Nirdoshamaina Yesuni Rakthamu - Naa Paapadoshamantha Kadige 3. Neevu Gaavinchina Baliyaagamukai - Saagilapadi Poojinchedanu 4. Naa Yadugulanu Bandapai Nilipi - Sthiraparachi Kaachithivi 5. Suvaartha Prakatimpa Nichchina Krupakai - Ninnu Shlaaghinthu Nenu Prabhuvaa 6. Yetlundagalanu Nee Paata Paadaka - Pondi Yunnatti Melulakai 7. Santhosha Hrudaya Uthsaaha Dhvanitho - Aaraadhincheda Ninnu Prabhuvaa