హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు - YouWorship
Hallelooya Naa Praanamaa Yehovaanu Sthuthinchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు (2) 1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను (2) నా బ్రతుకు కాలమంతయు - నా దేవుని కీర్తింతును (1) 2. రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కల్గదు వారిని - నమ్ముకొనకండి 3. వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు వారి సంకల్పములన్నియు నీ దినమే - నాశనము నొందున్ 4. యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు 5. ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్ ఆ తండ్రి యెన్నండైన తన మా- - టలు తప్పనివాడు 6. బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్ ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్ 7. బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్ పుట్టంధుల కన్నులను యెహోవా - తెరవజేసెడివాడు 8. క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే నీతిమంతుల నెల్లరిని - యెహోవా ప్రేమించున్ 9. పరదేశ వాసులను - కాపాడు వాడాయనే వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును 10. భక్తిహీనుల దారిని - వంకరగా జేయును యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును 11. సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్ Pallavi: Hallelooya Naa Praanamaa - Yehovaanu Sthuthinchu (2) 1. Naa Jeevithakaalamanthayu Ne Nehovaanu Sthuthinchedanu (2) Naa Brathuku Kaalamanthayu - Naa Devuni Keerthinthunu (1) 2. Raajula Chethanainanu - Mari Narula Chethanainanu Rakshanya Bhaagyamu Kalgadu Vaarini - Nammukonakandi 3. Vaari Praanamu Nashiyinchunu - Vaaru Mantilo Galasedaru Vaari Sangkalpamulanniyu Nee Diname - Naashanamu Nondun 4. Yaakobu Devundu - Evvaniki Saayambaguno Yevadehovaa Meeda Aashapettuno - Vaade Dhanyudu 5. Aakaasha Bhoomi Samudran - Daaniloni Dantha Srujinchen Aa Thandri Yennandaina Thana Maa- - Talu Thappanivaadu 6. Baadha Nondinavaariki - Athade Nyaayamu Theerchun Aakaligoninatti Vaariki Aa - Haaramu Dayacheyun 7. Bandhimpabadina Vaariki Bandhamulaayana Drunchun Puttandhula Kannulanu Yehovaa - Theravajesedivaadu 8. Krungginatti Janula - Ninggikeththedu Vaadaayane Neethimanthula Nellarini - Yehovaa Preminchun 9. Paradesha Vaasulanu - Kaapaadu Vaadaayane Verudikkuleni Vaarini Vidhavala Naadarinchunu 10. Bhakthiheenula Daarini - Vangkaragaa Jeyunu Yehovaaye Tharatharamulu Paripaa - Linchuchundunu 11. Seeyonu Nee Devudu - Tharatharamulu Raajya Melunu Yehovaanu Sthuthinchudi - Hallelooyaa Aamen