స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని - YouWorship
Svaasthyamugaa Nichchithivi Jayinchedu Vaanikanni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్వాస్థ్యముగా నిచ్చితివి - జయించెడు వానికన్ని (2) 1. నీవే మాకు దేవుడవై యున్నావు (2) - మేము నీదు పుత్రులమైతిమి (2) నీ స్వంత రక్తము నిచ్చి (2) - కొన్నావు నీ సొత్తుగా (2) 2. నిన్నంగీకరించిన వారలందరిని - నీ నామమందు నమ్మిన వారిన్ నీ పిల్లలుగాను జేసి - అధికారమిచ్చితివి 3. నీతో కూడా మహిమను పొందుటకు - నీ శ్రమలలో పాలుపొందుటచే నీ తోటి వారసులముగా - పరిగణింపబడితిమి 4. అక్షయమైన నిర్మలమైనదియు - వాడబారని స్వాస్థ్యము కొరకై మరల జన్మింపగా జేసి - స్థిరముగా నుంచితివి 5. నీ శాసనములు హృదయానందములు - అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా భావించి నిలిచి యున్నాము - హల్లెలూయ గీతములతో Pallavi: Svaasthyamugaa Nichchithivi - Jayinchedu Vaanikanni (2) 1. Neeve Maaku Devudavai Yunnaavu (2) - Memu Needu Puthrulamaithimi (2) Nee Svantha Rakthamu Nichchi (2) - Konnaavu Nee Soththugaa (2) 2. Ninnanggeekarinchina Vaaralandarini - Nee Naamamandu Nammina Vaarin Nee Pillalugaanu Jesi - Adhikaaramichchithivi 3. Neetho Koodaa Mahimanu Pondutaku - Nee Shramalalo Paalupondutache Nee Thoti Vaarasulamugaa - Pariganimpabadithimi 4. Akshayamaina Nirmalamainadiyu - Vaadabaarani Svaasthyamu Korakai Marala Janmimpagaa Jesi - Sthiramugaa Nunchithivi 5. Nee Shaasanamulu Hrudayaanandamulu - Avi Anniyu Maaku Nithya Svaasthyamugaa Bhaavinchi Nilichi Yunnaamu - Hallelooya Geethamulatho