స్వఛ్చంద సీయోను వాసి - YouWorship
Swachchandha Seeyonu Vaasi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి (2) శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2) దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో (2) సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2) ప్రశస్త రత్నములతో (2) ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద|| సుమముల హారము సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2) ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2) హిత వత్సరము విముక్తి (2) ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద|| జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2) నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2) అగ్ని మధ్యను నడచినను (2) జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద|| ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2) అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2) రహస్యములో మరుగైన (2) ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద|| గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2) నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2) ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2) ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద|| Swachchandha Seeyonu Vaasi Sarvaadhikaari – Kasthoori Pooraasi (2) Varthamaana Bhootha Bhavi-shyathkaala Vaasi (2) Alphaa Omega Thaane (2) Aadhyanthamu Mana Yese (2) ||Swachchandha|| Idigo Nenoka Nibandhananu Adhbhuthamuga Jethun – Nee Prajalandhari Yeduta (2) Parishodhimpajaalani Mahaa – Panulella Prabhuve (2) Lekkal Leni Yadhbhuthamul (2) Makkuvatho Cheyuvaadu (2) ||Swachchandha|| Sangeetham Naadhamula Thoda Seeyonu Puramu – Sompuganu Cherithimi (2) Shaashwatha Santhoshamu Maa – Shiramulapai Velasen (2) Dukhamu Nittoorpunu Poyen (2) Mikkili Aanandamu Kalgen (2) ||Swachchandha|| Neelamula Punaadhulu Vesi Neelaanjanamulatho – Maanikya Manulatho (2) Suvarna Shuneeyamula – Soorya Kaanthamutho (2) Prashastha Rathnamulatho (2) Pravimalamuga Ninu Gattedhanu (2) ||Swachchandha|| Sumamula Haaramu Santhoshaanandha Thailamu Needhe – Sthuthi Vasthramunu Needhe (2) Ullaasa Vasthrambu Needhe – Vidudhalayu Needhe (2) Hitha Vathsaramu Vimukthi (2) Aathmaabhishekamu Needhe (2) ||Swachchandha|| Jalamulalo Badi Daatunappudu Balamai Yundedhanu – Nee Thodai Yundedhanu (2) Nadhulalo Vellunappudu – Neepai Paaravu (2) Agni Madhyanu Nadachinanu (2) Jwaalalu Ninu Kaalchaga Levu (2) ||Swachchandha|| Itthadi Thalupula Bagula Gottedha Ninupa Gadiyalanu – Vidagottedhanu Nenu (2) Andhakaara Sthalamulalo Nu-nnatti Nidhulanu (2) Rahasyamulo Marugaina (2) Dhanamunu Nee Kosangedhanu (2) ||Swachchandha|| Garbhamuna Puttinadhi Modhalu Thalli Yodilona – Koorchundinadhi Modhalu (2) Nenu Chanka Bettukonna – Naadhu Prajalaaraa (2) Mudhimi Vachchu Varaku Ninnu (2) Etthukonu Vaadanu Nene (2) ||Swachchandha||