స్తోత్ర గీతములను పాడుచు - YouWorship
Sthothra Geethamulanu Paaduchu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి 1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని రమ్యమైన రాజును స్తుతించెదం 2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను - తన రక్తముతో మనల కొనెగదా 3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని - ఎంతైన జేయు సామర్థ్యుడని 4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము అత్తరును పూసిన - మరియ వలె మనమును - పరిమళంబులన్ వ్యాపింప జేయుదం 5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని ప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుము - ప్రభువే సర్వము మనకు 6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను జయము జయమటంచు ఆర్భటించెదం 7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే మహిమ దేహములను పొంది యుందుము Pallavi: Sthothra Geethamulanu Paaduchu - Priya Prabhuni Poojinchudi Hallelooya - Hallelooya - Hallelooya (2) Sthothra Geethamulanu Paaduchu - Priya Prabhuni Poojinchudi 1. Raarandi Santhasinchuchu - Raaraajunu Keerthinchanu Raajulaku Raajani - Prabhuvulaku Prabhuvani Ramyamaina Raajunu Sthuthinchedan 2. Siluvalo Baliyaayenu - Viluvaina Rakthamu Kaarchenu Entha Shramanondenu - Entha Baadha Norchenu - Thana Rakthamutho Manala Konegadaa 3. Vindu Shaalaku Thechchenu - Prema Dhvajamu Paikeththenu Vintha Sundarudani - Velalo Shreshthudani - Enthaina Jeyu Saamarthyudani 4. Mana Aathma Praana - Dehamul - Sajeevamuga Narpinthumu Aththarunu Poosina - Mariya Vale Manamunu - Parimalambulan Vyaapimpa Jeyudan 5. Prashansinche Prabhuvu Mariyanu - Manchi Kaaryamu Chesenani Prabhuvu Koraku Cheyumu - Praanamu Narpinchumu - Prabhuve Sarvamu Manaku 6. Maranamun Thaane Gelchenu - Saithaanunu Odinchenu Maranamun Mringgenu - Maranamullu Virichenu Jayamu Jayamatanchu Aarbhatinchedan 7. Aarbhaatamugaa Prabhuvu - Meghaaroodhudai Vachchunu Nishchayamugaa Manalanu Konipovu Vegame Mahima Dehamulanu Pondi Yundumu