స్తోత్రింతుము నిను - YouWorship
Sthothrinthumu Ninu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) పరిశుధ్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా (2) నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు (2) ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి (2) అందముగనూ కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| రాజ నీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు (2) శుభము శుభము శుభము నిత్యం హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము|| Sthothrinthumu Ninu Maadu Thandri Sathyamutho Aathmatho Neppudu (2) Parishuddhaalan-kaaramulatho Darshinchedamu Sharanam Sharanam (2) ||Sthothrinthumu|| Shreshta Yeevula Yoota Neeve Shreshta Kumaaruni Ichchinanduna (2) Thrithvamai Ekathvamaina Thri- Lokanaatha Sharanam Sharanam (2) ||Sthothrinthumu|| Dhavalavarnuda Rathnavarnuda Sathyaroopi Yanabaduvaadaa (2) Nanu Rakshinchina Rakshakundavu Naatha Neeve Sharanam Sharanam (2) ||Sthothrinthumu|| Sanghamunaku Shirassu Neeve Raajaa Neeke Namaskaaramulu (2) Mukhyamaina Moolaraayi Kotlakoladi Sharanam Sharanam (2) ||Sthothrinthumu|| Needu Sevakula Punaadi Gnaanamunaku Minchina Thelivi (2) Andamuganu Koodukonuchu Vedukondumu Sharanam Sharanam (2) ||Sthothrinthumu|| Raaja Neeke Sthuthi Sthothramulu Geethamulu Mangala Dhvanulu (2) Shubhamu Shubhamu Shubhamu Nithyam Hallelujah Aamen Aamen (2) ||Sthothrinthumu||