స్తోత్రించెదము - YouWorship
Sthothrinchedamu Daivakumaaruni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు|| కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు|| తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2) ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు|| ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2) స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు|| Sthothrinchedamu Daiva Kumaaruni – Noothana Jeevamutho (2) Nirantharamu Maarani Raajunu – Ghanambu Cheyudamu (2) Yesu Maa Rakshakudu – Kalmashamu Lenivaadu (2) Samasthamunu Kaligina Yesu Prabhunake Hallelujah (2) Bhayankaramaina Bheethini Golpedu – Jigata Oobhinundi (2) Balamaina Hasthamutho Nannu Etthi – Bandapai Sthiraparachen (2) ||Yesu|| Kanupaapaga Nanu Kaayu Prabhundu – Kunukadu Nidrinchadu (2) Thana Chethilo Nanu Chekkina Prabhuvunu Cheri Sthuthinchedamu (2) ||Yesu|| Tallidandriyu Yedabasinanu – Viduvaka Kaayunu (2) Ellappudu Nenu Bhajiyinchedanu – Vallabhudhesu Prabhun (2) ||Yesu|| Aathmeeya Poraatamunaku Prabhuvu – Aathmashakthinichchen (2) Sthuthiyu Neeke Ghanathayu Neeke – Yugayugamulalona (2) ||Yesu||