స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము - YouWorship
Sthothrinchi Keerthinthumu Ghanaparachedamu Koniyaadedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము (1) ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు (2) - స్తోత్రించి కీర్తింతుము (1) 1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె మనకై (1) మనల నడిపెను సుఖముగను (1) తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... (2) 2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపున్ పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు 3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినన్ పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు 4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు" తగిన సహాయము చేయును ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు 5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను శ్రాయేలుల కనికరించె ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు 6. నీతిమంతుల జూచె - దాదిబోలి కాచెన్ జ్యోతుల వలె నుండును అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు 7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల బాపున్ రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా Pallavi: Sthothrinchi Keerthinthumu - Ghanaparachedamu - Koniyaadedamu (1) Aadarinchi - Kaapaaduvaadu - Eederchuvaadu (2) - Sthothrinchi Keerthinthumu (1) 1. Manakintha Varaku Sahaayapaden - Thaanappaginchukone Manakai (1) Manala Nadipenu Sukhamuganu (1) Thanadu Sathyamu Nerpinchi - Kanupaapaga Kaache Aa ... (2) 2. Ee Dharaloni Narulalo - Yadhaartha Hrudayulaku Mudamuna Thana Chiththamu Thelupun Padilamuga Prabhukannulu - Pruthivini Parugeththu 3. Anni Samayamulalo - Kannulatho Bodhinchunu Nannu Maarchenu Thappinan Pennuga Hrudayamu Naadarinche - Anna GuruYesu 4. Agni Vanti Kannulu - Vighnamula Nundi Vidipinchu" Thagina Sahaayamu Cheyunu Ekkaalamandunu Kunukavu - Makkuva Pillalaku 5. Haagarunu Choochina Kannulu - Anekula Choochenu Shraayelula Kanikarinche Ejraaku Sahaayapaden - Nidrinchavu Nepudu 6. Neethimanthula Jooche - Daadiboli Kaachen Jyothula Vale Nundunu Athibalamichchu Avasarathan - Kshithininu Viduvadu 7. Edu Kannulu Galavaadu - Naadu Nedu Kaapaadunu Edathegani Chedugula Baapun Redula Nerparachu Vaadu - Paadudi Hallelooyaa