స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ - YouWorship
Sthothrinchi Keerthinchedamu Hallelooya
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ - స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ (2) అను పల్లవి: గడచిన కాలమెల్ల - కంటిపాపవలె (2) కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ (1) 1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన శాపమును మాపినాడు హల్లెలూయ (2) కన్నతల్లి వలెనే - కనికరించెను మమ్ము (2) యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ (1) 2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ ఎల్ల యీవులనిచ్చి - యుల్లాస మొసగును కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్ 3. శోధన కాలములందు హల్లెలూయ - మన - వేదన కాలములందు హల్లెలూయ నాథుడు యేసు మన చెంతనుండ నిల చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్ 4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు - ఘోరముగ లేచినను హల్లెలూయ దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్ 5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను - సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్ Pallavi: Sthothrinchi Keerthinchedamu Hallelooya - Sthuthi - Chellinchi Yullasinthamu Hallelooya (2) Anu Pallavi: Gadachina Kaalamella - Kantipaapavale (2) Kaachenu Prabhuvu Mammu Hallelooya - Prabhun (1) 1. Paapamunu Baapinaadu Hallelooya - Mana Shaapamunu Maapinaadu Hallelooya (2) Kannathalli Valene - Kanikarinchenu Mammu (2) Yennatharamaa Prema Hallelooya - Prabhun (1) 2. Thalliyaina Marachinanu Hallelooya - Thaanu Ennadaina Marachipodu Hallelooya Ella Yeevulanichchi - Yullaasa Mosagunu Kollaga Manala Kori Hallelooya - Prabhun 3. Shodhana Kaalamulandu Hallelooya - Mana - Vedana Kaalamulandu Hallelooya Naathudu Yesu Mana Chenthanunda Nila Chintha Lemiyu Raavu Hallelooya - Prabhun 4. Ghora Thuphaanu Lennenno Hallelooya - Bahu - Ghoramuga Lechinanu Hallelooya Doneyandunna Yesu - Divyamuganu Lechi Dhaatigaa Vaati Nanachu Hallelooya Prabhun 5. Sarvalokamunanduna Hallelooya - Nannu - Saakshiga Nunchenu Yesu Hallelooya Cherina Vaarinella Kori Preminchu Nesu Cherchunu Kaugitilo Hallelooya - Prabhun