స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా - YouWorship
Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా (2) పాత్రుల జేసి నేటివరకు మమ్ము (2) - కాచిన దేవా (1) 2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి పాపులకై జీవమిడి గొల్లలకు నిజ - హర్ష మిచ్చితివే 3. హేమకిరీటము తెల్లంగి నే ధరింప హీనకిరీటము ముండ్లతో పొందితి - నన్ను రక్షింప 4. పాపినై చేసెడు పాపములను తీర్చను ఏపుగ కల్వరి యందున నాకై - పాట్లుపడితివి 5. పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల పాపమృతులమౌ మమ్ము రక్షింప - ప్రాణమిచ్చితివే 6. సైతానును జయింప శక్తినిచ్చిన దేవా బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ - జ్ఞానమీయుము 7. ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును జీవమార్గమున చక్కగ నడుతు - నాయన శక్తిచే 8. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి దానములిమ్ము దయతోడ నిత్యము - దయగల మా తండ్రి 1. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa (2) Paathrula Jesi Netivaraku Mammu (2) - Kaachina Devaa (1) 2. Poththiguddala Chetha Chuttabadina Thandri Paapulakai Jeevamidi Gollalaku Nija - Harsha Michchithive 3. Hemakireetamu Thellanggi Ne Dharimpa Heenakireetamu Mundlatho Pondithi - Nannu Rakshimpa 4. Paapinai Chesedu Paapamulanu Theerchanu Epuga Kalvari Yanduna Naakai - Paatlupadithivi 5. Paapa Nivaarana Baliyagu Gorrepilla Paapamruthulamau Mammu Rakshimpa - Praanamichchithive 6. Saithaanunu Jayimpa Shakthinichchina Devaa Buddhitho Poraadi Yuddhamuna Gelva - Gnaanameeyumu 7. Eelaati Premanu Elaagu Thelpudunu Jeevamaargamuna Chakkaga Naduthu - Naayana Shakthiche 8. Doothalu Koniyaadu Gnaanudavagu Thandri Daanamulimmu Dayathoda Nithyamu - Dayagala Maa Thandri