స్తోత్రము స్తోత్రము ఓ దేవా - YouWorship
Sthothramu Sthothramu O Devaa
Artist: బన్యన్ జోసఫ్
Category: Praise & Worship
Song Lyrics
స్తోత్రము స్తోత్రము ఓ దేవా - ఈ వేకువనే - స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినము దయతో నిచ్చిన దేవా 1. పాపశోధనలనుండి - ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య 2. కన్న తండ్రికంటెను - కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా 3. ప్రీతా సుతా శుద్ధాత్మ లనెడి దేవా - ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా Sthothramu Sthothramu O Devaa - Ee Vekuvane - Sthothramu Jethumu Maa Devaa Raathriyamduna Mammu Rakshimchi Gaapaadi Dhaathri Mariyoka Dinamu Dayatho Nichchina Devaa 1. Paapashodhanalanumdi - Prabhuvaa Mammu Kaapaadi Brovumayya E Paapamu Mammun Ela Niyyakumda Maapu Repulumammu Manipi Brovumayya 2. Kanna Thamdrikamtenu - Kanikaramuna Kaapaadedi Maa Devaa Anna Dammulavale Me Mamdarini Premimchi Mannanatho Needinamu Mana Niyyumo Devaa 3. Preethaa Suthaa Shuddhaathma Lanedi Devaa - Preethitho Gaavumayyaa Neethimaargamulamdu Nirathamu Mamugaachi Khyaathigaa Neekoraku Brathukanimmo Devaa