స్తోత్రము యేసునాథా నీకు సదా - YouWorship
Sthothramu Yesunaathaa Neeku Sadaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా (2) స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు (2) 2. నేడు నీదు నామమందున - మేము - చేరి స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము 3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్య్రము 4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయె నాశ్చర్యము 5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భ టించుచుందురు 6. నీవు తప్ప మాకు పరమందున - వేరెవరు గలరు? ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు? 1. Sthothramu Yesunaathaa Neeku Sadaa - Sthothramu Yesunaathaa (2) Sthothramu Chellinthumu Needu Daasulamu - Pithraputhraathmalaku (2) 2. Nedu Needu Naamamanduna - Memu - Cheri Sthuthinchunatlu Chesina Krupakai Neeke Nirathamu - Sthothramu Chesedamu 3. Needu Rakthadhaarache Kaligina - Sajeeva Navamaargamu Daasulamu Thandri Sannidhi Cheranu - Nithyamu Svaathanthyramu 4. Itti Prabhaavamaina Padavini - Purugulamagu Maaku Intha Dayathoda Nichchina Krupamaa - Kenthaye Naashcharyamu 5. Doothala Sainyamulu Shrunggaara - Geethamula Neppudu Raajaadhiraajaa Nee Sthuthulu Paaduchu - Naarbha Tinchuchunduru 6. Neevu Thappa Maaku Paramanduna - Verevaru Galaru? Iddarayandu Neevu Thappa Maaku Aadarana Evaru?