స్తుతులివిగో నా ప్రభువా - YouWorship
Sthuthulivigo Naa Prabhuvaa
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Praise
Song Lyrics
స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్ పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ ఎంత ఘనమైనది నీ స్నేహం వివరింపలేనిది నీ త్యాగం నను ప్రేమించే ప్రియనేస్తమా ||స్తుతులివిగో|| పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసెదన్ శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును (2) ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాధారము నీవే ఓ ప్రేమా నా ప్రేమా నీవే జీవన మార్గము నీవే (2) ఏది ఏమైన గాని నిన్ను స్తుతియింతును కష్టమేమైన గాని నిన్ను విడువను ప్రభూ నీతోనుండుటే జీవితం నీతోనుండుటే ధన్యము ||స్తుతులివిగో|| ప్రతి స్థితిగతులను మార్చువాడా నీవే ఆశ్రయదుర్గము దిక్కులేని వారలను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు (2) ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడంబు నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గంబు నీవే బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే ఎలా నీ ఋణం తీర్చెదన్ నా సర్వం నీకే అంకితం ||స్తుతులివిగో|| Sthuthulivigo Naa Prabhuvaa Priyamaina Naa Devaa Melulakai Sthothramulu Deevenakai Kruthagnathalu Shuddhudaa Parishuddhudaa Ninne Keerthinchedan Poornudaa Paripoornudaa Ninne Kolichedan Entha Ghanamainadi Nee Sneham Vivarimpalenidi Nee Thyaagam Nanu Preminche Priyanesthamaa Poraatamula Paristhithulalo Nee Vaipe Choosedan Shodhana Shramalalo Kanneeti Baadhalalo Ninne Kanugondunu (2) O Devaa Naa Devaa Neeve Naa Kshemaadhaaramu Neeve O Premaa Naa Premaa Neeve Jeevana Maargamu Neeve (2) Edi Emaina Gaani Ninnu Sthuthiyinthunu Kashtamemaina Gaani Ninnu Viduvanu Prabhoo Neethonundute Jeevitham Neethonundute Dhanyamu ||Sthuthulivigo|| Prathi Sthithigathulanu Maarchu Vaadaa Neeve Aashrayadurgamu Dikkuleni Vaaralanu Aadukonuvaadaa Melu Cheyu Devudavu (2) O Raajaa Naa Raajaa Neeve Naa Rakshana Kedambu Neeve O Prabhuvaa Naa Prabhuvaa Neeve Naa Aashrayadurgambu Neeve Baanisanaiyunna Nannu Biddagaa Chesithive Yogyathe Leni Nannu Arhunigaa Chesithive Elaa Nee Runam Theerchedan Naa Sarvam Neeke Ankitham ||Sthuthulivigo||