స్తుతి పాడుటకే - YouWorship
Sthuthi Paadutake
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే|| Sthuthi Paadutake Brathikinchina – Jeevanadaathavu Neevenayyaa Innaalluga Nanu Poshinchina – Thalli Vale Nanu Odaarchina Nee Prema Naapai Ennadu Maaradu Yesayyaa (2) Jeevithakaalamanthaa Aadhaaram Neevenayyaa Naa Jeevithakaalamanthaa Aaraadhinchi Ghanaparthunu ||Sthuthi Paadutake|| Praana Bhayamunu Tholaginchinaavu – Praakaaramulanu Sthaapinchinaavu Sarva Janulalo Nee Mahima Vivarimpa Deerghaayuvutho Nanu Nimpinaavu (2) Nee Krupaa Baahulyame Veedani Anubandhamai Thalachina Prathi Kshanamuna Noothana Balamichchenu ||Sthuthi Paadutake|| Naapai Udayinche Nee Mahima Kiranaalu – Kanumarugaayenu Naa Dukha Dinamulu Krupalanu Pondi Nee Kaadi Moyutaku Lokamulonundi Erparachinaavu (2) Nee Divya Sankalpame Avanilo Shubhapradamai Nee Nithya Raajyamunakai Nireekshana Kaliginchenu ||Sthuthi Paadutake|| Hethuvu Lekaye Preminchinaavu – Vedukagaa Ila Nanu Maarchinaavu Kalavaramondina Velalayandu Naa Cheyi Viduvaka Nadipinchinaavu (2) Nee Prema Maadhuryame Naa Nota Sthuthigaanamai Nilichina Prathi Sthalamuna Paarenu Selayerulai ||Sthuthi Paadutake||