స్తుతియింతుము యేసు ప్రభువా - YouWorship
Sthuthiyinthumu Yesu Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతియింతుము యేసు ప్రభువా - మా స్తుతికి పాత్రుడా (2) నిత్యం నిన్నే ఆరాధించి (2) - మహిమ పరతుము ఇలలో (2) స్తుతికి పాత్రుడా (1) 1. మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా (2) ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా (1) నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా (2) 2. లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా 3. సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా 4. నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా Pallavi: Sthuthiyinthumu Yesu Prabhuvaa - Maa Sthuthiki Paathrudaa (2) Nithyan Ninne Aaraadhinchi (2) - Mahima Parathumu Ilalo (2) Sthuthiki Paathrudaa (1) 1. Maa Paapamulu Mammu Neeku - Bahudoorambu Jeyagaa (2) E Paapamerugani Prabhuvaa - Maakai Siluvalo Baliyaithivaa (1) Nee Rakthamutho Mammu Kadigi - Nee Chenthaku Cherchithivaa (2) 2. Lokaashaku Longgipoyi - Nee Sahavaasamunu Veedaga Aakaashamunu Veedi Maakai - Neetho Sahavaasa Mosagithivaa Parishuddhalugaa Mammu Theerchi - Parama Svaasthyamu Nichchithivaa 3. Saathaanuku Daasulamai - Nithya Maargamunu Veedaga Pathanamaina Maa Brathukul - Nithya Jeevamugaa Maarchithivaa Nithyamu Ninne Sevimpa - Sathyavaakyamu Nosagithivaa 4. Nireekshana Leka Memu - Nirbhaagyulamai Yundagaa Thvaragaa Raanai Yunna Prabhuvaa - Parama Nireekshana Nichchithivaa Nee Raakakai Eduru Chooda - Siddhapaatunu Nosagithivaa