స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు - YouWorship
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: స్తుతియించు ప్రభున్ స్తుతియించు -నీవు స్తుతియించు - ప్రభున్ స్తుతియించు (1) నా ప్రాణమా - నా సమస్తమా (2) 1. ఆయన చేసిన ఉపకారములలో (2) నా ప్రాణమా నీవు మరువకుమా (1)- దేనిన్ - నా ప్రాణమా నీవు మరువకుమా (1) నీ దేవుని నీవు మరువకుమా (2) 2. నీ దోషములను మన్నించి వేసి నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ రోగముల నన్నింటిని కుదుర్చి వేయుచున్నాడు 3. నా ప్రాణమును సమాధి నుండి విమోచించిన వాడని - ప్రభు - విమోచించిన వాడని కరుణా కిరీటము నియ్యన్ 4. పక్షిరాజు యౌవనము వలె నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన యౌవన ముండునట్లు మేలుతో తృప్తిపరచును 5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు వ్యాజ్యమాడడు ప్రతీకారము చేయడు 6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల యెడల కృపనంత అధికముగా చేసియున్నాడు 7. పడమటికి తూర్పెంత యెడమో పాపములకును మనకంత - మన - పాపములకును మనకంత యెడము గలుగ జేసెను 8. తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా - బహు - జాలిపడునట్లు యెహోవా భక్తులపై జాలిపడును 9. మంటివాడవని ఆయన యెరుగున్ నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మింపబడిన విధమెరుగున్ నీ దేవుడు నిన్ను నెరుగును 10. దేవదూతలారా దైవభక్తులారా యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా మహాసైన్యములారా హల్లెలూయ పాట పాడుడి Pallavi: Sthuthiyinchu Prabhun Sthuthiyinchu -Neevu Sthuthiyinchu - Prabhun Sthuthiyinchu (1) Naa Praanamaa - Naa Samasthamaa (2) 1. Aayana Chesina Upakaaramulalo (2) Naa Praanamaa Neevu Maruvakumaa (1)- Denin - Naa Praanamaa Neevu Maruvakumaa (1) Nee Devuni Neevu Maruvakumaa (2) 2. Nee Doshamulanu Manninchi Vesi Nee Rogamula Nannintini - Prabhu - Nee Rogamula Nannintini Kudurchi Veyuchunnaadu 3. Naa Praanamunu Samaadhi Nundi Vimochinchina Vaadani - Prabhu - Vimochinchina Vaadani Karunaa Kireetamu Niyyan 4. Pakshiraaju Yauvanamu Vale Noothana Yauvana Mundunatlu - Neeku - Noothana Yauvana Mundunatlu Melutho Thrupthiparachunu 5. Deerghashaanthudu Dayagala Devudu Yellappudu Vyaajyamaadadu - Neetho - Ellappudu Vyaajyamaadadu Pratheekaaramu Cheyadu 6. Bhoomikante Entha Aakaashameththo Bhakthula Yedala Krupanantha - Thana - Bhakthula Yedala Krupanantha Adhikamugaa Chesiyunnaadu 7. Padamatiki Thoorpentha Yedamo Paapamulakunu Manakantha - Mana - Paapamulakunu Manakantha Yedamu Galuga Jesenu 8. Thandri Thana Kumaaruni Yedala Jaalipadunatlu Yehovaa - Bahu - Jaalipadunatlu Yehovaa Bhakthulapai Jaalipadunu 9. Mantivaadavani Aayana Yerugun Nirmimpabadina Vidhamerugun - Neevu - Nirmimpabadina Vidhamerugun Nee Devudu Ninnu Nerugunu 10. Devadoothalaaraa Daivabhakthulaaraa Yehovaa Mahaasainyamulaaraa - O - Yehovaa Mahaasainyamulaaraa Hallelooya Paata Paadudi