స్తుతియించి కీర్తించి - YouWorship
Sthuthiyinchi Keerthinchi
Artist: సునీల్ ప్రేమ్ కుమార్
Category: Praise
Song Lyrics
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి|| Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Naa Yesayyaa (2) Neeve Naa Aaraadhana Yesayyaa Neeve Naa Sthuthi Paathrudaa Naa Yesayyaa Neeve Naa Aathmalo Aanandamayyaa Neeve Naa Jeevitha Makarandamayyaa ||Sthuthiyinchi|| Gaadaandhakaaramulona Velugai Nadipinchinaavaa Agaadha Jalamulalona Maargamu Choopinchinaavaa (2) Anudinamu Mannaanu Pampi Prajalanu Poshinchinaavaa (2) Nee Prajalanu Poshinchinaavaa ||Sthuthiyinchi|| Agni Gundamu Nundi Neevu Vidipinchinaavu Simhapu Noti Nundi Maranamu Thappinchinaavu (2) Prathi Kshanamu Neevu Thoduga Nundi Prajalanu Rakshinchinaavu (2) Nee Prajalanu Rakshinchinaavu ||Sthuthiyinchi|| Paapamulo Unna Maakai Rakthamu Chindinchinaave Maranamulo Unna Maakai Siluvalo Maraninchinaave (2) Anudinamu Maatho Neevundi Mammu Nadipinchu Devaa (2) Mamu Paramuku Nadipinchu Devaa ||Sthuthiyinchi||