స్తుతించెదను స్తుతించెదను - YouWorship
Sthuthinchedanu Sthuthinchedanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను|| పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను|| తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను|| సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను|| Sthuthinchedanu Sthuthinchedanu Naa Yesu Prabhun Kruthagnathatho Anudinamu ||Sthuthinchedanu|| Unnatha Devudu Sarvaadhipathiyu – Urvi Paripaalaka (2) Unnatham Visarjinchi Nanu Vedakina – Utthama Snehithuni (2) Udayam Sandhyaa Ellappudunu – Uthsaaha Dhwanitho Paadedanu (2) ||Sthuthinchedanu|| Naashanakaramaina Paapa Gunta Nundi – Naraka Vedana Nundi (2) Nannu Vidipinchi Nilipina Devaa – Nirmala Swaroopa (2) Neethi Samaadhaanam Santhoshamutho – Nithya Jeevamu Naakichchithivi (2) ||Sthuthinchedanu|| Paapamu Kshaminchi Rohamu Baapi – Bhayamunu Deerchi (2) Pavithradaayaka Paavana Moorthi – Parishuddha Michchina (2) Parama Paadam Sharanyam Naaku – Parama Raajaa Punya Devaa (2) ||Sthuthinchedanu|| Thalli Garbhamunaku Munderparachi – Dehamu Namarchiyunu (2) Dakshina Baahutho Pattukonina – Dayaa Sampoornudaa (2) Dikku Jayamu Aadaranayu – Dayatho Anugrahinchithivi (2) ||Sthuthinchedanu|| Siluvanetthi Shramalu Sahinchi – Sevaku Pilachina (2) Sneha Darshaka Veera Yodha – Samshaya Haaraka (2) Shramalu Ninda Aakaliyaina – Nee Snehamunundi Edabaapunaa (2) ||Sthuthinchedanu||