స్తుతించుము స్తుతించుము - YouWorship
Sthuthinchumu Sthuthinchumu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
"రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును" ప్రకటన Revelation 19:16 పల్లవి : స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని 1. యెరూషలేమా తెరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించును అడ్డుపరచక నేడే రమ్మనుము ప్రభుయేసు నీకు రాజాయెను || స్తుతించుము || 2. ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు దూరమునుండక తృణీకరింపక అంగీకరించుము నీ రాజుగా || స్తుతించుము || 3. మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే || స్తుతించుము || 4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము మచ్చునుబోలి కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రారాజు || స్తుతించుము || 5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మద్వారానే చేయుచుండె యాజకులముగా పూజింతమెప్పుడు స్తుతికి యోగ్యుడు - మన ప్రభువే || స్తుతించుము || 6. దైవ నివాసస్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించె నిల్లు పూర్ణముగ || స్తుతించుము || "Raajulaku Raajunu Prabhuvulaku Prabhuvunu" Prakatana Revelation 19:16 Pallavi : Sthuthinchumu Sthuthinchumu PrabhuYesu Raaraajani 1. Yerooshalemaa Theruvumu Dvaaramu Raaju Neelo Praveshinchunu Adduparachaka Nede Rammanumu PrabhuYesu Neeku Raajaayenu || Sthuthinchumu || 2. Enduku Neevu Daari Tholagithivi Pilachenu Nee Rakshakudu Dooramunundaka Thruneekarimpaka Anggeekarinchumu Nee Raajugaa || Sthuthinchumu || 3. Maaru Manassunu Pondumane Prabhu Thana Raajyamunaku Cherchanu Raaju Yesuni Sveekarinchumu Nee Hrudayamunaku Raajaayane || Sthuthinchumu || 4. Yesuraaju Yillu Kattuchunnaadu Saundaryamainadi Aa Gruhamu Machchunuboli Kattuchunnaadu Aayane Prabhuvu Raaraaju || Sthuthinchumu || 5. Sajeevaraallatho Kattuchunnaadu Aathmadvaaraane Cheyuchunde Yaajakulamugaa Poojinthameppudu Sthuthiki Yogyudu - Mana Prabhuve || Sthuthinchumu || 6. Daiva Nivaasasthalamaunatlu Kalasi Nirmimpabadithimi Yesu Prabhuni Naipunya Hasthamu Nirminche Nillu Poornamuga || Sthuthinchumu ||