సుధా మధుర కిరణాల - YouWorship
Sudhaa Madhura Kiranaala
Artist: జాలాడి
Category: Christmas
Song Lyrics
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా|| Sudhaa Madhura Kiranaala Arunodayam Karunaamayuni Sharanam Arunodayam (2) Thera Marugu Hrudayaalu Velugainavi Maranaala Cherasaala Marugainadi (2) ||Sudhaa|| Divi Raajugaa Bhuviki Diginaadani – Ravi Rajugaa Ilanu Migilaadani (2) Navaloka Gaganaalu Pilichaadani – Paraloka Bhavanaalu Therichaadani (2) Aarani Jeevana Jyothiga Velige Thaarokatochchindi Paade Paatala Pashuvulashaalanu Ooyala Chesindi (2) Ninu Paavaga – Nirupedagaa – Janminchagaa – Ila Panduga (2) ||Sudha|| Lokaalalo Paapa Shokaalalo – Ekaakilaa Brathuku Avivekulu (2) Kshama Hrudaya Sahanaalu Samapaalugaa – Premaanu Raagalu Sthira Aasthigaa (2) Nammina Vaarini Rammani Piliche Rakshakudaa Yese Nithya Sukhaala Jeevajalaala Pennidhi Aa Prabhuve (2) Aa Janmame – Oka Marmamu – Aa Bandhame – Anubandhamu (2) ||Sudha||