సుఖమిచ్చెగద మాకు - YouWorship
Sukhamichchegada Maaku
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
సుఖ మిచ్చెగద మాకు - ప్రభుయేసువా నీ - సురుచిరమగు వాక్కు = నిఖిలకల్మష వనమునకు దవ - శిఖి శిఖలవలె గాల్చు నీదగు - ముఖవికాసిత వాక్యములు బహు - సుఖము లొసంగు తవాఖ్రితాళికి ||సుఖ మిచ్చి! 11. జగతిలోపల మెండుగ - నుండిన వివిధ - మగు శాస్త్రములు జూడంగ = మిగుల గందరగోళమై మరి - యొకటి కొకటి విరుద్ధముగ మ -ర్యగణ కల్పిత మగుచు నున్నవి - తగని వని ద్రోచితిమి వాటిని సుఖ మిచ్చె|| 2. _ నీ వాక్యముల భావము - నమ్మిన పాపి - జీవుల కది జీవము = కేవలం బగు ధర్మశాస్త్రము - దేవుం డిచ్చిన దొకటి బైబిలు - ఈ వసుధంగల సర్వ పాపులం బ్రోవ వచ్చిన నిన్నుం జూపెను || సుఖ మిచ్చె|| Sukha Michchegada Maaku - Prabhuyesuvaa Nee - Suruchiramagu Vaakku = Nikhilakalmasha Vanamunaku Dava - Shikhi Shikhalavale Gaalchu Needagu - Mukhavikaasitha Vaakyamulu Bahu - Sukhamu Losanggu Thavaakhrithaaliki ||Sukha Michchi! 11. Jagathilopala Menduga - Nundina Vividha - Magu Shaasthramulu Joodangga = Migula Gandaragolamai Mari - Yokati Kokati Viruddhamuga Ma -Ryagana Kalpitha Maguchu Nunnavi - Thagani Vani Drochithimi Vaatini Sukha Michche|| 2. _ Nee Vaakyamula Bhaavamu - Nammina Paapi - Jeevula Kadi Jeevamu = Kevalan Bagu Dharmashaasthramu - Devun Dichchina Dokati Baibilu - Ee Vasudhanggala Sarva Paapulan Brova Vachchina Ninnun Joopenu || Sukha Michche||