సుక్షేమ శుభకాల - YouWorship
Sukshema Shubhakaala
Artist: క్రిస్టఫర్ వర్డ్స్వర్త్
Category: Praise & Worship
Song Lyrics
1. సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్రిత్వ దేవ స్తుతిం గావింతు మెంతయు 2. నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యం బడెను 3. భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము పితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు 1. Sukshema Shubhakaala Vishraanthi Dinamaa Vichaaramella Theerchu Daivaadivaaramaa Eenaadu Memu Koodi Devaalayambuna Maa Thrithva Deva Sthuthin Gaavinthu Menthayu 2. Neeyandu Srushtikartha Vishraama Mondenu Neeyandu YesuKreesthu Mruthyu Bandhamunu Threnchuchu Thaanu Lechi Chaavun Jayinchenu Nee Yandu Paavanaathma Maakiyyan Badenu 3. Bhoovaasu Lee Dinambu Santhoshapaduchu Suvaartha Vini, Paadi Maa Yesu Sthothramu Pithruputhra Shuddhaathma Thrithvambau Devuni Uthsaaha Dhvanithoda Nentho Sthuthinthuru