సీయోనులో నుండి నీవు - YouWorship
Seeyonulo Nundi Neevu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2) కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2) నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని కీర్తిoచెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో|| నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2) నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2) నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో|| Seeyonulo Nundi Neevu – Prakaashinchuchunnaavu Naapai (2) Samaadhaanamai – Sadaakaalamu Nanu Neetho Nadipinchuchunnaavu Nee Keerthikai Seeyonulo Mahonnathudaa Yesayyaa (2) Nirdoshamaina Maargamulo – Naa Antharangamuna Dhairyamunichchi (2) Nee Sannidhilo Nanu Nilipi – Unnatha Vijayamunichchithivi (2) Nee Aashalu Neraverutaku – Nee Chitthamu Jariginchutaku Viduvavu Nanu Yedabaayavu Neevu Viduvavu Nanu Yedabaayavu ||Seeyonulo|| Naayandu Drushti Nilipi – Nee Snehabandhamutho Aakarshinchi (2) Krupaa Varamulatho Nanu Nimpi – Sathya Saakshigaa Maarchithivi (2) Nee Manassunu Pondukoni – Nee Premanu Nimpukoni Keerthinchedanu Prathi Nithyam Ninu Aaraadhinthunu Anukshanamu ||Seeyonulo|| Nee Divyamaina Mahimanu – Paralokamandune Choochedanu (2) Nee Kougililo Cherchukoni – Prathi Bhaashpa Binduvunu Thudichedavu (2) Nee Maatala Makarandamunu – Marapuraani Anubandhamunu Maruvanu Ennadu Viduvanu Nenu Maruvanu Ennadu Viduvanu ||Seeyonulo||