సీయోనుపట్టణమా సువర్ణ నగరమా - YouWorship
Seeyonupattanamaa Suvarna Nagaramaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. సీయోనుపట్టణమా - సువర్ణ నగరమా (2) మహిమాపురమా - మహా భాగ్యము నీదే (2) రమ్యమైనట్టిరా - రాజుపురమా (2) 2. సీయోను సుందరులు - సువర్ణ సములు వన్నెపగడాల ఛాయ - కన్న గొప్పది కాంతి నీలములకన్న - మంచిది (2) 3. ప్రభువే నిన్ను కోరి - ప్రేమించినాడు సర్వోన్నతుడే నిన్ను - స్థిరము జేసెను (2) నిత్యనివాసముగ - నిను జేసెను (2) 4. తన చంటిపిల్లను - తల్లి మరచునా మరచినగాని నేను - మరువను నిన్ను చెక్కితిని నిను నా యర - చేతుల మీద 5. భయమేల సీయోను - బలమొందిలెమ్ము సంతసమున పాట సాహాసమున పాడుడీ వసియించు నీ ప్రభువు - వచ్చి నీలో 6. పెండ్లి కుమారుడు - పెండ్లి కూతురును చూచునట్లు నిన్ను - చూచి దేవుడు సీయోను నీయందు - సంతస మొందున్ 7. సీయోను పగవారు - సిగ్గునొందెదరు నిన్ను భాదించినట్టి - నీ పగవారు పరుగున నీ పాదముల - పై బడెదరు 8. సీయోను నీ నీతి - సూర్య కాంతివలె రయమున యేసు నీదు - రక్షణజ్యోతి వెలిగించువరకు - విశ్రమించడు 1. Seeyonupattanamaa - Suvarna Nagaramaa (2) Mahimaapuramaa - Mahaa Bhaagyamu Neede (2) Ramyamainattiraa - Raajupuramaa (2) 2. Seeyonu Sundarulu - Suvarna Samulu Vannepagadaala Chhaaya - Kanna Goppadi Kaanthi Neelamulakanna - Manchidi (2) 3. Prabhuve Ninnu Kori - Preminchinaadu Sarvonnathude Ninnu - Sthiramu Jesenu (2) Nithyanivaasamuga - Ninu Jesenu (2) 4. Thana Chantipillanu - Thalli Marachunaa Marachinagaani Nenu - Maruvanu Ninnu Chekkithini Ninu Naa Yara - Chethula Meeda 5. Bhayamela Seeyonu - Balamondilemmu Santhasamuna Paata Saahaasamuna Paadudee Vasiyinchu Nee Prabhuvu - Vachchi Neelo 6. Pendli Kumaarudu - Pendli Koothurunu Choochunatlu Ninnu - Choochi Devudu Seeyonu Neeyandu - Santhasa Mondun 7. Seeyonu Pagavaaru - Siggunondedaru Ninnu Bhaadinchinatti - Nee Pagavaaru Paruguna Nee Paadamula - Pai Badedaru 8. Seeyonu Nee Neethi - Soorya Kaanthivale Rayamuna Yesu Needu - Rakshanajyothi Veliginchuvaraku - Vishraminchadu