సిలువ మోసినావా - YouWorship
Siluva Mosinaavaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సిలువ మోసినావా - శ్రమలకోర్చినావా - యేసునాధా సత్యజీవం స్వర్గమునకు దారి అ||ప|| ఆహా - నాదోషములే - మహావేదన - మోక్ష రాజా - సర్వసత్య సంపూర్ణ ప్రదీప 1. రాతియంతటను - రోదనముచే - గెత్సెమనే వనమందు - గడిపి గొప్ప వేదనముతో - ప్రార్థింపగ తండ్రిని - ప్రాణనాధా రక్తధారల్ - నాకై రాల్చినావా ||సిలువ|| 2. గుదియలతో వచ్చినారా - కట్టికొట్టుచు నిన్ - దిట్టినారా కండ్లగంతల్ కట్టి - కొరడాలతోను గొట్టి కఠినులంతా ముండ్లమకుట మౌదుల మొత్తినారా ||సిలువ|| 3. కొయ్య నెత్తి - కల్వరిగిరి వరకు మొయ్యమనుచు నిన్ - మరిమొత్తినారా మూర్భులందరు నీదు - మోముపై నుమియు 4. జీవజలముల్ - జీవమునిచ్చే దేవ - దాహమాయెన - ధరయందు నీకు - చేదు కలిపినట్టి - ద్రాక్షారసమునిచ్చి - ద్రాగనునిరా దాహము తీరెన - నీకు తండ్రి ||సిలువ|| ర్. పంచఖండంబు - ప్రజలన్ రక్షింప - పంచగాయంబులను పొంది తుదకు - అప్పగింతున్ తండ్రి - ఆత్మనిదిగో యనుచు - జెప్పి నాధా అర్చణనిచ్చినావా ||సిలువ|| 6. మరణమై నీవు మరిలేచినావా - మరణపుముల్లన్ - మరివిరిచి నావా -మాకు విజయంబిచ్చి - మోక్షపురికి మరలనరిగినావా హల్లెలూయ మళ్ళివచ్చెదవా? ||సిలువ|| Siluva Mosinaavaa - Shramalakorchinaavaa - Yesunaadhaa Sathyajeevan Svargamunaku Daari A||Pa|| Aahaa - Naadoshamule - Mahaavedana - Moksha Raajaa - Sarvasathya Sampoorna Pradeepa 1. Raathiyanthatanu - Rodanamuche - Gethsemane Vanamandu - Gadipi Goppa Vedanamutho - Praarthimpaga Thandrini - Praananaadhaa Rakthadhaaral - Naakai Raalchinaavaa ||Siluva|| 2. Gudiyalatho Vachchinaaraa - Kattikottuchu Nin - Dittinaaraa Kandlaganthal Katti - Koradaalathonu Gotti Kathinulanthaa Mundlamakuta Maudula Moththinaaraa ||Siluva|| 3. Koyya Neththi - Kalvarigiri Varaku Moyyamanuchu Nin - Marimoththinaaraa Moorbhulandaru Needu - Momupai Numiyu 4. Jeevajalamul - Jeevamunichche Deva - Daahamaayena - Dharayandu Neeku - Chedu Kalipinatti - Draakshaarasamunichchi - Draaganuniraa Daahamu Theerena - Neeku Thandri ||Siluva|| R. Panchakhandambu - Prajalan Rakshimpa - Panchagaayambulanu Pondi Thudaku - Appaginthun Thandri - Aathmanidigo Yanuchu - Jeppi Naadhaa Archananichchinaavaa ||Siluva|| 6. Maranamai Neevu Marilechinaavaa - Maranapumullan - Marivirichi Naavaa -Maaku Vijayambichchi - Mokshapuriki Maralanariginaavaa Hallelooya Mallivachchedavaa? ||Siluva||