సిలువే నా శరణాయెను రా - YouWorship
Siluve Naa Sharanaayenu Raa
Artist: చెట్టి భానుమూర్తి
Category: Good Friday
Song Lyrics
సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluve Naa Sharanaayenu Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Siluva Yande Mukthi Balamu Choochithi Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Siluvanu Vraali Yesu – Palikina Palukulandu Viluvaleni Premaamruthamu Grolithi Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Siluvanu Choochu Koladi – Shila Samaanamaina Manasu Naligi Karigi Neeraguchunnadi Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Siluvanu Darachi Tharachithi – Viluvakandagaraani Nee Krupa Kalushamellanu Baapaga Chaalunu Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka Siluva Yedutanu Nilachinaadanu Raa Nee… Siluve Naa Sharanaayenu Raa Sharanu Yesu Sharanu Sharanu – Sharanu Sharanu Naa Prabhuvaa Duritha Dooruda Nee Dari Jerithi Raa Nee… Siluve Naa Sharanaayenu Raa