సిలువేకదా చింతసదా - YouWorship
Siluvekadaa Chinthasadaa
Artist: రావూరి రంగయ్య
Category: Praise & Worship
Song Lyrics
సిలువేకదా చింతసదామహా - సిలువేకదా - మనకమోఘము - వెలలేని యాత్మ సంభోగము - విలసత్చరమ ద్రవ్యభాగ్యము - గుణత్యాగము ననురాగము మహా ||సిలువే|| 1. సిలువ బోధకు చెవినొగ్గుమా - చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు నీకు సౌభాగ్యము - ఆత్మారోగ్యము నెంతో శ్లాఘ్యము ||సిలువే|| 2. చంపెనిందు ప్రభుని కర్తను - సంపాదించె నర విముక్తుని బెంపారు నానందమసూక్తిని - ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే|| 3. _పాపదావాగ్ని సంతుప్తులు - స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తలు - సుఖ ప్రాప్తులు సర్వ మహా ||సిలువే|| 4. రంగొప్ప దీని ప్రసంగము - మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ భృంగము - రక్షశ్చంగము పాపభంగము మహా ||సిలువే|| 5. భయములేదని చాటుచున్నది - ప్రియయేసు వేడుకొమ్మన్నది - దయ జూపు నీ కనుచున్నది - నిక్కమైనది చక్మనైనది మహా ||సిలువే|| 6. చేరవచ్చిన వారి భారము - ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ సారము - సువిచారము సదాచారము మహా ||సిలువే|| 7... ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము - జనకృపాసుధా పానము దూతగానము తేజోమానము మహా 8. దినము లూరకుంటిమి - యిపుడే రక్షణ కనుగొంటిమి - కన్న తండ్రిని గొల్వకుంటిమి - కానకుంటిమి యెరగకుంటిమి మహా ||సిలువే|| Siluvekadaa Chinthasadaamahaa - Siluvekadaa - Manakamoghamu - Velaleni Yaathma Sambhogamu - Vilasathcharama Dravyabhaagyamu - Gunathyaagamu Nanuraagamu Mahaa ||Siluve|| 1. Siluva Bodhaku Chevinoggumaa - Cheluvamugona Naathma Noggumu Valla Noppu Neeku Saubhaagyamu - Aathmaarogyamu Nentho Shlaaghyamu ||Siluve|| 2. Champenindu Prabhuni Karthanu - Sampaadinche Nara Vimukthuni Bempaaru Naanandamasookthini - Nanurakthini Nithyamukthini Mahaa ||Siluve|| 3. _Paapadaavaagni Santhupthulu - Svapunyadurmada Vyaapthulu Nee Peru Nammina Deepthalu - Sukha Praapthulu Sarva Mahaa ||Siluve|| 4. Ranggoppa Deeni Prasanggamu - Manggalageethasaaranggamu Anggeekaara Hruthpadma Bhrunggamu - Rakshashchanggamu Paapabhanggamu Mahaa ||Siluve|| 5. Bhayamuledani Chaatuchunnadi - Priyayesu Vedukommannadi - Daya Joopu Nee Kanuchunnadi - Nikkamainadi Chakmanainadi Mahaa ||Siluve|| 6. Cheravachchina Vaari Bhaaramu - Ghoramainanu Thadvichaaramu Aaroodhiparamaartha Saaramu - Suvichaaramu Sadaachaaramu Mahaa ||Siluve|| 7... Ghanamaina Rakshaka Dhyaanamu Manala Mukthiki Jerchuvainamu - Janakrupaasudhaa Paanamu Doothagaanamu Thejomaanamu Mahaa 8. Dinamu Loorakuntimi - Yipude Rakshana Kanugontimi - Kanna Thandrini Golvakuntimi - Kaanakuntimi Yeragakuntimi Mahaa ||Siluve||