సాగిలపడి ఆరాధించెదము - YouWorship
Saagilapadi Aaraadhinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సాగిలపడి ఆరాధించెదము -సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ (2) 1. దూతలు కనబడి గానము చేసిరి (2) - సతతము మహిమ సర్వోన్నతునికి (2) శాంతియు భువిలో పరిశుద్ధులకు (2) - పావనుడేసుని పూజించెదము (1) 2. గొల్లలు గాంచిరి ఘనకాపరిని - ఉల్లములెల్లను రంజిల్లగను ఎల్లరకు చాటిరి వల్లభుని - ఉల్లాసముతో కొనియాడెదము 3. జ్ఞానులు గనిరి ఘనమగు తారన్ - పూనికతో పయనము గావించి కానుకలిడి పూజించిరి రాజున్ - తనివి తీరగ ఘనపరచెదము 4. మరియ ప్రభుదయ విరివిగ బొంది - ప్రణుతించెను ప్రభు దర్శనమొంది పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు - మురియుచు మదిలో మ్రొక్కెద మిపుడే 5. సుమెయోను స్తుతియించె దేవుని - గమనించె ఘన రక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ - విమలుని మరి మరి స్తుతియించెదము 6. వివరించెనన్న విమోచకుని - విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతియించుచు నీ భువిలో - పవిత్రుని బహు పూజించెదము 7. పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు - రాజులరాజు ప్రభువుల ప్రభువు రాజ్యము నిచ్చెన్ రాజుల జేసెను - విజయుడు యేసుని పూజించెదము Pallavi: Saagilapadi Aaraadhinchedamu -Sathyamutho Aathmatho Shree Yesun (2) 1. Doothalu Kanabadi Gaanamu Chesiri (2) - Sathathamu Mahima Sarvonnathuniki (2) Shaanthiyu Bhuvilo Parishuddhalaku (2) - Paavanudesuni Poojinchedamu (1) 2. Gollalu Gaanchiri Ghanakaaparini - Ullamulellanu Ranjillaganu Ellaraku Chaatiri Vallabhuni - Ullaasamutho Koniyaadedamu 3. Gnaanulu Ganiri Ghanamagu Thaaran - Poonikatho Payanamu Gaavinchi Kaanukalidi Poojinchiri Raajun - Thanivi Theeraga Ghanaparachedamu 4. Mariya Prabhudaya Viriviga Bondi - Pranuthinchenu Prabhu Darshanamondi Parishuddhadu Prabhu YesuKreesthu - Muriyuchu Madilo Mrokkeda Mipude 5. Sumeyonu Sthuthiyinche Devuni - Gamaninche Ghana Rakshana Narulaku Nirmala Velugu Nirmala Mahima - Vimaluni Mari Mari Sthuthiyinchedamu 6. Vivarinchenanna Vimochakuni - Vishvaasulaku Parishuddhalaku Devuni Sthuthiyinchuchu Nee Bhuvilo - Pavithruni Bahu Poojinchedamu 7. Poojaneeyudu Prabhu YesuKreesthu - Raajularaaju Prabhuvula Prabhuvu Raajyamu Nichchen Raajula Jesenu - Vijayudu Yesuni Poojinchedamu