సర్వ శరీరుల దేవుడా - YouWorship
Sarva Shareerula Devudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా (2) చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే లేనే లేదయ్యా హో యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల|| ఆదాము హవ్వలను చేసినట్టి దేవా సృష్టికర్త నీకే స్తోత్రము హేబెలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా స్తోత్రము హానోకును నీతో కూడా నడిపినావు నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు సర్వశక్తుడా – నీతిమంతుడా మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా|| అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహాము దేవా స్తోత్రము ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు ఇస్సాకు దేవా స్తోత్రము యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు యోసేపును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా – యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా|| మోషేతో పొద నుండి మాటలాడినావుగా ఉన్నవాడా నీకే స్తోత్రము ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా|| గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా విజయశీలుడా స్తోత్రము సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా యూదా సింహమా స్తోత్రము బోయజుతో రూతును విమోచించినావు సమూయేలును మందసం నుండి పిలిచినావు పరిశుద్ధుడా – విమోచకుడా ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా|| దావీదు నా హృదయానుసారుడంటివే రాజాధి రాజా స్తోత్రము సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు అనంత జ్ఞాని స్తోత్రము ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు ఆత్మ రూపుడా – రోషవంతుడా జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా|| నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు యెరూషలేము దేవా స్తోత్రము జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు మందసపు దేవా స్తోత్రము ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు దానియేలును సింహాల నుండి బ్రోచినావు షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా|| యెహోషాపాతుకై పోరు సలిపినావు యుద్ధ శూరుడా స్తోత్రము యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా యజమానుడా స్తోత్రము హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు యెషయాకు దర్శనమును చూపినావు మహిమ రూపుడా – నిత్య జీవుడా సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా|| యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా నమ్మదగిన దేవా స్తోత్రము యోనాను చేప కడుపు నుండి లేపినావుగా దీర్ఘశాంతుడా స్తోత్రము యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు యోహానును త్రోవ సరళ పరచ పంపినావు ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా|| కృపా సత్యములు మాకై తెచ్చినావుగా యేసు దేవా నీకే స్తోత్రము తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా దేవ తనయుడా స్తోత్రము రక్తధారతో మా పాపమంతా కడిగినావు మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు పునరుత్థానుడా – అభిషిక్తుడా పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా|| పేతురును బండలా స్థిరము చేసినావుగా పరిశుద్ధాత్ముడా స్తోత్రము సౌలును అపొస్తలునిగా మార్చినావుగా ఆశ్చర్యకరుడా స్తోత్రము యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా|| Sarva Shareerula Devudaa Neekasaadhyame Ledayaa (2) Chaachina Nee Baahuvutho Bhoomi Aakaashaalu Chesithive Ninna Nedu Nirantharam – Ekareethiguntive Lene Ledayyaa Ho Yesayyaa Neekasaadhyamainadedhi Ledayyaa Lene Ledayyaa Maa Yesayyaa Neekasaadhyamainadhedhi Ledayyaa (2) ||Sarva Shareerula|| Aadaamu Havvalanu Chesinatti Devaa Srushtikartha Neeke Sthothramu Hebelu Arpananu Angeekarinchina Gorrepilla Devaa Sthothramu Haanokunu Neetho Kooda Nadipinaavu Novaahunu Pralaya Jalamu Nundi Kaachinaavu Sarvashakthudaa – Neethimanthudaa Maarpu Leni Maa Devudaa ||Lene Ledayyaa|| Abrahaamutho Nibandhananu Chesinaavu Abrahaamu Devaa Sthothramu Issake Vaagdhaana Puthrudannaavu Issaku Devaa Sthothramu Yaakobunu Ishraayelugaa Maarchinaavu Yosepunu Pedda Raajugaa Chesinaavu Sreemanthudaa – Yaakobu Devudaa Choochuchunna Maa Devudaa ||Lene Ledayyaa|| Moshetho Podha Nundi Maatalaadinaavugaa Unnavaadaa Neeke Sthothramu Erra Sandramun Rendu Paayalugaa Cheelchinaavu Bheekarundaa Neeke Sthothramu Yehoshuvaakai Soorya Chandrulanu Aapinaavu Kaalebuku Yavvana Balamunu Ichchinaavu Megha Sthambhamaa – Agni Sthambhamaa Cheelchabadina Banda Daivamaa ||Lene Ledayyaa|| Gidyonu Sainyamuku Jayamunichchinaavugaa Vijayasheeludaa Sthothramu Samsonuku Simha Balamunichchinaavugaa Yoodaa Simhamaa Sthothramu Boyajutho Roothunu Vimochinchinaavu Samooyelunu Mandasam Nundi Pilichinaavu Parishuddhudaa – Vimochakudaa Ebinezaru Sthothramu ||Lene Ledayyaa|| Daaveedu Naa Hrudayaanusaarudantive Raajaadhi Raajaa Sthothramu Solomonuku Aathma Gnaanamentho Ichchinaavu Anantha Gnaani Sthothramu Eliyaakai Agni Pampi Neevu Gelachinaavu Elishaaku Rendanthalaathmanichchinaavu Aathma Roopudaa – Roshavanthudaa Jeevamu Gala Devudaa ||Lene Ledayyaa|| Nehemyaatho Padina Godalu Kattinchinaavu Yerushalemu Devaa Sthothramu Jerubbaabelunaddaginchu Konda Nanipinaavu Mandhasapu Devaa Sthothramu Estheruche Raaju Aagnane Maarchinaavu Daaniyelunu Simhaala Nundi Brochinaavu Shadhrak Meshaaku – Abednegola Devudaa Nithya Raajya Sthaapakudaa ||Lene Ledayyaa|| Yehoshaapaathukai Poru Salipinaavu Yuddha Shoorudaa Sthothramu Ebbeju Sarihaddulistharinchinaavugaa Yajamaanudaa Sthothramu Hizkiyaaku Aayushshu Neevu Penchinaavu Yeshayaaku Darashanamunu Choopinaavu Mahima Roopudaa – Nithya Jeevudaa Simhaasanaaseenudaa ||Lene Ledayyaa|| Yobuku Rettimpu Deevenichchinaavugaa Nammadhagina Devaa Sthothramu Yonaanu Chepa Kadupu Nundi Lepinaavugaa Deerghashaanthudaa Sthothramu Yehezkelupai Nee Aathma Hasthamunchinaavu Yohaanunu Throva Sarala Paracha Pampinaavu Pravachanaathmudaa – Manushya Kumaarudaa Pravakthalandariki Devudaa ||Lene Ledayyaa|| Krupaa Sathyamulu Maakai Thechchinaavugaa Yesu Devaa Neeke Sthothramu Thandri Chitthamu Antha Neraverchinaavugaa Deva Thanayudaa Sthothramu Rakthadhaaratho Maa Paapamantha Kadiginaavu Mruthyunjayudavai Samaadhi Gunde Cheelchinaavu Punarutthaanudaa – Abhishikthudaa Paapula Rakshakudaa ||Lene Ledayyaa|| Pethurunu Bandalaa Sthiramu Chesinaavugaa Parishuddhaathmudaa Sthothramu Soulunu Aposthalunigaa Maarchinaavugaa Aascharyakarudaa Sthothramu Yohaanuku Nee Raajya Mahima Choopinaavu Sanghaaniki Ippudu Thodugaa Undinaavu Pendli Kumaarudaa – Prema Roopudaa Raanunna Maa Devudaa ||Lene Ledayyaa||