సర్వ లోకమా - YouWorship
Sarva Lokamaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం ప్రభుని నామమును ప్రబల పరచెదం (2) ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు స్తుతి మహిమలు సదా అర్పించెదం అతి సుందరుడు మహిమైశ్వరుడు ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2) సంతోషించుమా ఆనందించుమా ఆయన చేసినవి మరువకుమా సన్నుతించుమా మహిమ పరచుమా ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| శోధన వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2) రక్షకుడేసు రక్షిస్తాడు ఆయన నామములో జయం మనదే ఇమ్మానుయేలు మనలో ఉండగా జీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ|| Sarva Lokamaa Sthuthi Geetham Paadedam Prabhuni Naamamunu Prabala Parachedam (2) Aascharyakarudu Adbhuthakarudu Sthuthi Mahimalu Sadaa Arpinchedam Athi Sundarudu Mahimaishwarudu Aayana Naamamunu Keerthinchedam Ellappudu ||Sarva|| Anni Kaalamulalo Unnaadu Untaadu Anni Sthithi Gathulalo Nadipisthaadu (2) Santhoshinchumaa Aanandinchumaa Aayana Chesinavi Maruvakumaa Sannuthinchumaa Mahima Parachumaa Aayana Naamamunu Ghanaparachu Ellappudu ||Sarva|| Shodhana Vedhana Edi Edurainaa Morapedithe Chaalune Vidipisthaade (2) Rakshakudesu Rakshisthaadu Aayana Naamamulo Jayam Manade Immaanuyelu Manalo Undagaa Jeevithamanthaa Dhanyame Dhanyame ||Sarva||