సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే - YouWorship
Sarvonnathuni Chaatuna Nivasinchedi Vaade
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును (2) 1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే (1) సర్వశక్తుని నీడను విశ్రమించును - పరమ ధన్యత యిదియే (2) 2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును - నేనమ్ముకొను దేవుడు 3. పగటి బాణమున కైనా - రాత్రి భయమున కైనా చీకటిలో తిరిగు తెగులుకైనా - నేనేమి భయపడను 4. వేయి పదివేలు - కుడిప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు 5. నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు 6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్ పాదములకు రాయి తగులకుండ - నిన్నెత్తికొందురు 7. కొదమ సింహముల - నాగుపాముల నణచెదవు అతడు నా నామము నెరిగెను - అతని తప్పించెదను 8. అతడు నను ప్రేమించెన్ - నామమున - మొఱ్ఱపెట్టెన్ అతని విడిపించి ఘనపరతున్ - అతని కుత్తరమిత్తున్ Pallavi: Thana Rekkala Krinda Aashrayamu - Thana Rekkalatho Kappunu (2) 1. Sarvonnathuni Chaatuna Nivasinchedi Vaade (1) Sarvashakthuni Needanu Vishraminchunu - Parama Dhanyatha Yidiye (2) 2. Aayane Naa Aashrayamu - Naa Kotayu Durgamunu Aayana Sathyamu Naa Kedemunu - Nenammukonu Devudu 3. Pagati Baanamuna Kainaa - Raathri Bhayamuna Kainaa Cheekatilo Thirigu Thegulukainaa - Nenemi Bhayapadanu 4. Veyi Padivelu - Kudiprakkanu Koolinanu Dayachoopu Devudu Neekunda - Apaayamu Raadu 5. Nee Prabhuvaashrayame - Yehovaa Nivaasan Apaayamu Thegulu - Nee Gudaaramu Sameepinchavu 6. Needu Maargambulalo - Ninnu Doothalu Kaayun Paadamulaku Raayi Thagulakunda - Ninneththikonduru 7. Kodama Sinhamula - Naagupaamula Nanachedavu Athadu Naa Naamamu Nerigenu - Athani Thappinchedanu 8. Athadu Nanu Preminchen - Naamamuna - Morrapetten Athani Vidipinchi Ghanaparathun - Athani Kuththaramiththun