సర్వోన్నతుండగు దేవుని - YouWorship
Sarvonnathundagu Devuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
"మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును." ప్రకటన Revelation 22:1-(2) "చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను. లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను." యెషయా Isaiah 41:19 పల్లవి : సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను అనుపల్లవి : సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము 1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె || సర్వోన్నత || 2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలో సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల జీవుల మధ్యనుండెను - దేవుని గొర్రెపిల్ల ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే || సర్వోన్నత || 3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది పట్టణపు వీధులలో - ప్రవహించుచుండెను స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవృక్షంబు స్వస్థత కలిగించును - వృక్షంపు యాకులు || సర్వోన్నత || 4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్ మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్ బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్ || సర్వోన్నత || 5. మెట్టల స్థలమందున - నదుల పారజేతున్ ఊటల నెన్నో లోయల - నుబుకంగ జేతును నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను || సర్వోన్నత || 6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని || సర్వోన్నత || 7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్ బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము || సర్వోన్నత || "Mariyu Sphatikamuvale Merayunatti Jeevajalamula Nadi Devuni Yokkayu Gorrapilla Yokkayu Sinhaasanamunoddanundi Aa Pattanapu Raajaveedhi Madhyanu Pravahinchuta Aa Dootha Naaku Choopenu. Aa Nadi Yokka Eevalanu Aavalanu Jeevavrukshamundenu; Adi Nelanelaku Phalinchuchu Pandrendu Kaapulu Kaayunu. Aa Vrukshamu Yokka Aakulu Janamulanu Svasthaparachutakai Viniyoginchunu." Prakatana Revelation 22:1-(2) "Chetluleni Mettalameeda Nenu Nadulanu Paarajesedanu. Loyalamadhyanu Ootalanu Ubukajesedanu. Aranyamunu Neetimadugugaanu Endina Nelanu Neetibuggalugaanu Chesedanu." Yeshayaa Isaiah 41:19 Pallavi : Sarvonnatha Sthalambulo - Devunike Mahima Sarvaadhikaari Yesuni Siluvache Kaligenu Anu Pallavi : Sarvonnathundagu Devuni - Sevakulai Yundiyu Sarvonnathuni Chiththambuna - Sarvadaa Sthuthiyinchedamu 1. Paraloka Yerooshalemuna - Parishuddhala Sangghambu Muriyuchu Bhartha Yesukai - Arudenchuchundenu Parishuddha Pattanamanduna - Prabhu Yesu Kreesthundu Prakaashamaanadeepamai - Prajvalinchuchu Nunde || Sarvonnatha || 2. Devuni Sinhaasanamuna - Devuni Mahimalo Suvarna Kireetambula Dharinchina Peddala Jeevula Madhyanundenu - Devuni Gorrepilla Ghanatha Mahima Prabhaavamu - Yugayugamulu Aayanake || Sarvonnatha || 3. Sphatikambu Bolinatti Merayu - Jeeva Jalanadi Pattanapu Veedhulalo - Pravahinchuchundenu Sphatikampu Nadi Kiruprakkala - Jeeva Phalavrukshambu Svasthatha Kaliginchunu - Vrukshampu Yaakulu || Sarvonnatha || 4. Bandalo Nundi Neetikaalvala Ninduga Rappinchen Mendaina Nadula Neellanu - Dandiga Paarinchen Bandaina Kreesthunu Cheelchenu - Prabhudevunde Manaku Nindaara Nimpu Naathmanu - Thandri Vidheyulan || Sarvonnatha || 5. Mettala Sthalamanduna - Nadula Paarajethun Ootala Nenno Loyala - Nubukangga Jethunu Neetimadugulugaa Maarcheda - Naranyamu Nanthatini Neeti Buggalugaa Chethunu - Endina Nelanu || Sarvonnatha || 6. Daaveedu Pattanamanduna - Daaveedu Santhathilo Devuni Sarvashakthitho - Janminche Yesundu Daaveedu Thaalamu Kaligi - Thana Sinhaasanamandu Thaavichchi Cherchukonunu - Jayinchuvaarini || Sarvonnatha || 7. Silvalo Maraninchenu Shree Yesu Naa Koraku Viluvaina Rakthamu Kaarchenu - Malinambu Bogottan Baludaina Aathma Shakthitho - Geliche Samaadhini Balamichchunu Parishuddhalaku - Hallelooyaa Paadedamu || Sarvonnatha ||