సర్వశక్తుని స్తోత్రగానము - YouWorship
Sarvashakthuni Sthothra Gaanamu
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise
Song Lyrics
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| ముదముతో నిర్మానకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వoచి దేవుని వందనముతో వేడరే (2) ||సర్వ|| వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవు నిక మీ స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుఁగా నుతి జేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడు మ- హేష్టులను రక్షించును (2) ||సర్వ|| దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరక మైదాల్పరే (2) ||సర్వ|| Sarva Shakthuni Sthothragaanamu Salpare Jagamellanu Nirvahinchunu Daasa Bhaaramu Nithyamedha Raajillanu (2) ||Sarva|| Mudamutho Nirmaanakundagu Moola Karthanu Baadare Vadana Meekshmaanvanchi Devuni Vandanamutho Vedare (2) ||Sarva|| Vedapaaraayanamu Seyuchu Vishwamantha Jayimpare Saadaramugaa Devu Nika Mee Swaanthamuna Boojimpare (2) ||Sarva|| Edanu Vishraanthin Pareshuni Hechchugaa Nuthi Jeyare Sadamalambagu Bhakthitho Mee Sarva Maayana Keeyare (2) ||Sarva|| Chaavu Puttuka Lenivaaduga Santhathamu Jeevinchunu Eevulichchuchu Dannu Vedu Ma- heshtulanu Rakshinchunu (2) ||Sarva|| Daasulai Devuniki Nedalo Darpamunu Bogaalpare Yesukreesthuni Punya Vasthramu Ne Maraka Maidaalpare (2) ||Sarva||