సర్వశక్తి యుతుడా సభకు శిరస్సా - YouWorship
Sarvashakthi Yuthudaa Sabhaku Shirassaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము - వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము 1. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము 2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము || జీవింప|| 3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు || జీవింప|| 4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్ || జీవింప|| 5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్ || జీవింప|| 6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు || జీవింప|| 7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్ || జీవింప|| Pallavi: Jeevimpacheyumu Nammi Praarthinthumu - Vaakku Neraveruvaraku - Kaachiyundedamu 1. Sarvashakthi Yuthudaa - Sabhaku Shirassaa Korathayekkuvaayenu - Thvaragaa Krupanimmu 2. Prematho Pilchithivi - Nannu Rakshinchithivi Nee Jeevamu Naalo Vaadenu - NaaDevaa Digumu || Jeevimpa|| 3. Prema Challaarene - Aathma Korathache Shavamuvale Naithini - Nee Chetha Nanneththu || Jeevimpa|| 4. Praarthana Vaanchhayu - Vaakyambu Naasakthi Naalo Nootagaa Raanimmu - Sarvan Samarpinthun || Jeevimpa|| 5. Vairi Chera Veedan - Porupattudalatho Salpi Jeevapathrika Gaa - Neeche Prakaashinthun || Jeevimpa|| 6. Aathma Pendlikumaaraa - Neeraaka Korakai Nirbhayamutho Vechiyunda - Naanidra Pogottu || Jeevimpa|| 7. Hallelooya Paadanu - Marupulu Tholagunu Shuddhaathmanu Vedakunu - Ellarakun Chaatan || Jeevimpa||