సర్వజనులారా వినుడి మీరేకంబుగా వినుడి - YouWorship
Sarvajanulaaraa Vinudi Meerekambugaa Vinudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి (2) 1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి (2) దరిద్రులు ధనికులేమి సర్వజనులారా వినుడి (2) 2. నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినది నే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి 3. గూడార్థాంశము వినెద - చేతబట్టి సితార మర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి 4. నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్ ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి 5. తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికి నేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి 6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు సోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి 7. వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తము చేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి 8. ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికిని తీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి Pallavi: Sarvajanulaaraa Vinudi - Meerekambugaa Vinudi (2) 1. Loka Nivaasulaaraa Saamaanyulu Ghanulemi (2) Daridrulu Dhanikulemi Sarvajanulaaraa Vinudi (2) 2. Naa Hrudaya Dhyaanamu Poorna - Vivekamunu Goorchinadi Ne Palkeda Gnaanaanshamula - Sarva Janulaaraa Vinudi 3. Goodaarthaanshamu Vineda - Chethabatti Sithaara Marmamu Delpeda Nenu - Sarva Janulaaraa Vinudi 4. Naakai Ponchina Doshula - Kriyalu Nannu Chuttan Aapadalo Bhayapadanela - Sarva Janulaaraa Vinudi 5. Thama Dhana Sampadanubatti - Pogadukonedu Vaariki Nenela Bhayapadavalenu - Sarva Janulaaraa Vinudi 6. Evadereethinaina Nithyamu Brathukunatlu Sodaruni Rakshinchaledu - Sarva Janulaaraa Vinudi 7. Vaani Nimiththamu Daiva - Sannidhi Praayashchiththamu Cheyuvaadevvadu Ledu - Sarva Janulaaraa Vinudi 8. Praana Vimochana Dhanamu - Bahu Goppa Dennatikini Theeraka Yundavalasinade - Sarva Janulaaraa Vinudi