సరిచేయుమో దేవా - YouWorship
Sari Cheyumo Devaa
Artist: క్రాంతి చేపూరి
Category: Correction
Song Lyrics
సరిచేయుమో దేవా నన్ను బలపరచుమో ప్రభువా (2) నీ ఆత్మతో నను అభిషేకించి సరి చేయుమో దేవా (2) ||సరి|| దూరమైతి నీ సన్నిధి విడచి పారిపోతి నీ గాయము రేపి లోకమునే స్నేహించితి నేను పాపము మదిలో నింపుకున్న అది తప్పని తెలిసి తిరిగి వచ్చి నీ సన్నిధిలో నే మోకరించి బ్రతిమాలుచున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| నింపుము నీ వాక్యము మదిలో పెంచుము నను నీ పాలనలో శోధనను గెలిచే ప్రతి మార్గం ఇవ్వుము నాకు ప్రతి క్షణము నీ సన్నిధిలో ఒక దినమైనను వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని తెలుసుకున్నాను నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| Sari Cheyumo Devaa Nannu Balaparachumo Prabhuvaa (2) Nee Aathmatho Nanu Abhishekinchi Sari Cheyumo Devaa (2) ||Sari|| Dooramaithi Nee Sannidhi Vidachi Paaripothi Nee Gaayamu Repi Lokamune Snehinchithi Nenu Paapamu Madilo Nimpukunna Adi Thappani Thelasi Thirigi Vachchi Nee Sannidhilo Ne Mokarinchi Brathimaaluchunnaanu Nannu Sari Cheyumo Devaaa (2) ||Sari|| Nimpumu Nee Vaakyamu Madilo Penchumu Nanu Nee Paalanalo Shodhananu Geliche Prathi Maargam Ivvumu Naaku Prathi Kshanamu Nee Sannidhilo Oka Dinamainanu Veyi Dinamulakante Bahu Shreshtamu.. Ani Thelusukunnaanu Nannu Sari Cheyumo Devaa (2) ||Sari||