సమస్త జనులారా - YouWorship
Samastha Janulaaraa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| తానెయొనర్చె మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించె నైగుప్తునుండి (2) నలువది వత్సరములు నడిపించె కానానుకు మిమ్ము చేర్చుటకు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మోషేకు తన సేవను నొసగె యెహోషువా జయమును పొందె (2) శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనె మిమ్ము తన రక్తముతో (2) ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమాయన స్వరము (2) అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన యెదుట (2) ఆయనను స్తుతియించుడి ||సమస్త|| Samastha Janulaaraa Meeru Yehovaaku Sthuthi Gaanamu Paadi Santhoshamutho Sannidhilo Uthsaahinchudi Jayamanuchu (2) ||Samastha|| Thaane Yonarche Mahakaaryamulan Paapini Rakshimpa Baliyaayen (2) Shathruni Raajyamu Kooladrosenu Smariyinchudi Meerandarunu (2) Aayananu Sthuthiyinchudi ||Samastha|| Gnaapakamunchuko Ishraayelu Vidipinche Naiguputhu Nundi (2) Naluvadi Vathsaramulu Nadipinche Kaanaanuku Mimmu Cherchutaku (2) Aayananu Sthuthiyinchudi ||Samastha|| Mosheku Than Sevanu Nosage Yehoshuvaa Jayamunu Ponde (2) Shathruni Gelchi Raajyamu Ponde Ghana Kaaryamulanu Smariyinchi (2) Aayananu Sthuthiyinchudi ||Samastha|| Meere Prabhuni Swantha Prajalugaa Kone Mimmu Thana Rakthamutho (2) Aathmala Cherchi Sanghamu Katte Aa Reethini Kani Smatiyinchu (2) Aayananu Sthuthiyinchudi ||Samastha|| Pilichenu Prabhuvu Sevaku Mimmu Nede Vinumaayana Swaramu (2) Arpinchudi Mee Jeevithamulanu Saagilapadi Aayana Yeduta (2) Aayananu Sthuthiyinchudi ||Samastha||