సజీవుడవైన యేసయ్యా - YouWorship
Sajeevudavaina Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన|| Sajeevudavaina Yesayyaa Ninnaashrayinchina Nee Vaariki Sahaayudavai Thrupthi Parachithive Samudramantha Samruddhitho (2) Aanandincheda Neelo – Anudinamu Krupa Pondi Aaraadhincheda Ninne – Aananda Dhvanulatho (2) Dhana Raasule Ila – Dhanavanthulaku – Ee Loka Bhaagyamu Daachina Melulenno – Dayachesinaave – Iha Paramuna Naaku (2) Shramala Maargamunu Nireekshana Dwaaramuga Chesithive Shreshtamaina Nee Vaagdhaanamulatho (2) ||Sajeevudavaina|| Kshemamu Nondutaye – Sarva Janulaku – Prayaasagaa Maare Kshemaadhaaramu Neevai – Deerghaayuvutho – Santhrupthi Parathuvu Nannu (2) Nithya Nibandhanagaa Nee Vaathsalyamunu Choopithive Nithyamaina Nee Sathya Vaakyamutho (2) ||Sajeevudavaina|| Naluvadi Endlu – Nee Swaasthyamunu – Mosinadi Neeve Nee Krupa Kaanthilo – Naa Cheyi Viduvaka – Nadipinchuchunnadi Neeve (2) Parama Raajyamulo Mahimatho Nimputaku Anugrahinchithive Paripoornamaina Nee Upadeshamunu (2) ||Sajeevudavaina||