సంపూర్ణ జ్ఞానము కలిగి - YouWorship
Sampoorna Gnaanamu Kaligi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సంపూర్ణ జ్ఞానము కలిగి - ఆత్మఫలము నందు అభివృద్ధి నొందుడి సంపూర్ణ జ్ఞానము కలిగి (1) 1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను (1) అంధకార సంబంధమైన - అధికారములనుండి విడుదలదొరికె (2) ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము (2) నీవు ప్రేమను కలిగి యుండుము. (2) 2. ప్రభు యేసు అదృష్యుండైన - దేవుని రూపము గలవాడు సర్వసృష్టికి కర్తయు తానే - నిన్ను నూతన సృష్టిగా జేసె ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు ఎల్లప్పుడు ఆనందించుము 3. మృతులలో నుండి మొదట లేచె - యున్నవాడు యేసుప్రభు మనలను తండ్రి రాజ్యమునకు - వారసులుగా జేసియున్నాడు ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు ఏలనిమ్ము సమాధానము 4. క్రీస్తేసునందు సర్వసంపూర్ణత - నిండి యున్నది సిలువ మరణము ద్వారానే మనల - తండ్రితో సమాధాన పరచే ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడుచుకొనుము నీవు దీర్గశాంతము కలిగి యుండుము 5. సమస్త సృష్ఠికి ప్రకటింప బడిన - సువార్తను విడువక విశ్వాసమందు నిలిచిన యెడల - నీవామహిమను పొందెదవు ప్రభునకన్ని విషయములలో - తగినట్టుగా నడచుకొనుము నీవు దయాళుత్వము కనుపరచుము Pallavi: Sampoorna Gnaanamu Kaligi - Aathmaphalamu Nandu Abhivruddhi Nondudi Sampoorna Gnaanamu Kaligi (1) 1. Kreesthesunandu Manaku Paapa- Kshamaapana Kaligenu (1) Andhakaara Sambandhamaina - Adhikaaramulanundi Vidudaladorike (2) Prabhunakanni Vishayamulalo - Thaginattugaa Naduchukonumu (2) Neevu Premanu Kaligi Yundumu. (2) 2. Prabhu Yesu Adrushyundaina - Devuni Roopamu Galavaadu Sarvasrushtiki Karthayu Thaane - Ninnu Noothana Srushtigaa Jese Prabhunakanni Vishayamulalo - Thaginattugaa Nadachukonumu Neevu Ellappudu Aanandinchumu 3. Mruthulalo Nundi Modata Leche - Yunnavaadu YesuPrabhu Manalanu Thandri Raajyamunaku - Vaarasulugaa Jesiyunnaadu Prabhunakanni Vishayamulalo - Thaginattugaa Nadachukonumu Neevu Elanimmu Samaadhaanamu 4. Kreesthesunandu Sarvasampoornatha - Nindi Yunnadi Siluva Maranamu Dvaaraane Manala - Thandritho Samaadhaana Parache Prabhunakanni Vishayamulalo - Thaginattugaa Naduchukonumu Neevu Deergashaanthamu Kaligi Yundumu 5. Samastha Srushthiki Prakatimpa Badina - Suvaarthanu Viduvaka Vishvaasamandu Nilichina Yedala - Neevaamahimanu Pondedavu Prabhunakanni Vishayamulalo - Thaginattugaa Nadachukonumu Neevu Dayaaluthvamu Kanuparachumu