సందేహమేల - YouWorship
Sandehamela
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా (2) యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు (2) నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల|| Sandehamela Samshayamadela Prabhu Yesu Gaayamulanu Parikinchi Choodu Gaayaalalo Nee Vrelu Thaakinchi Choodu (2) ||Sandehamela|| Aa Mulla Makutamu Neekai – Dhariyinchene Nee Paapa Shikshanu Thaane – Bhariyinchene (2) Pravahinche Raktha Dhaara Nee Kosame Kadu Ghora Himsanonde Nee Kosame (2) ||Sandehamela|| Endaaka Yesuni Neevu – Eragananduvu Endaaka Hrudayamu Bayata – Nilavamanduvu (2) Yesayya Prema Neeku Lokuvaayenaa Yesayya Siluva Suvaartha Chulakanaayenaa (2) ||Sandehamela|| Ee Loka Bhogamulanu – Veedajaalavaa Saathaanu Bandhakamandu – Santhasinthuvaa (2) Yesayya Sahanamuthone Chelagaatamaa Eenaadu Rakshana Dinamu Grahiyinchumaa (2) ||Sandehamela|| Lokaana Evvaru Neekai – Maranincharu Nee Shikshalanu Bhariyimpa – Sahiyincharu (2) Nee Thalliyaina Gaani Ninnu Marachune Aa Prema Moorthi Ninnu Maruvajaalunaa (2) ||Sandehamela||