సంతోషించుడి యందరు - YouWorship
Santhoshinchudi Yandaru
Artist: బేతాళ జాన్
Category: Christmas
Song Lyrics
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించె మున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరే భక్తుల కన్ను లాస దీరె ||సంతోషించుడి|| ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచును నీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతోషించుడి|| పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను జూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతోషించుడి|| Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi Yoka Vinthagu Keerthana Baada Vachithini Santhoshinchudi Naatho Santhoshinchudi ||Santhoshinchudi|| Andhakaara Mayamaina Bhoomi Naa Dyanthamu Veligimpa – Daani Yaa-veshamu Dolagimpa Vandhithundu Kreesthesu Naathudu – Vachche Brakaashundai Bhoomiki Nichche Prakaashambu ||Santhoshinchudi|| Kaana Nandhakaarambu Dholaga Pra Kaashinchenu Lendu – Meeru Pra-kaashimpanu Randu Maanavulanu Santhosha Parchanai – Mahini Navatharinche Bhakthula Manamu Santhasinche ||Santhoshinchudi|| Minnu Nundi Santhoshodayamu Migula Prakaashinche – Hrudayamul – Dagula Prakaashinche Munnu Jeyabadina Vaagdhaththamu – Thinnaga Neravere Bhakthula Kannu Laasa Dheere ||Santhoshinchudi|| Preethiyaina Nee Panduga Goorchi Noothana Keerthananu – Galasikoni – Naatho Paaduchunu Nee Thari Doorasthula-kee Vaarthanu – Ne Theerunu Naina Delupaga Naathurapadavalenu ||Santhoshinchudi|| Paapulapai Devuniki Galigina Prabalamaina Dayanu – Lokamun – Joopimpa Gavalenu Joopaka Poyina Lopamu Manapai – Mopabadunu Nijamu Vegamu Joopudha Maa Pathamu ||Santhoshinchudi||