సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ - YouWorship
Santhoshame Santhoshame Santhoshamutho Sthuthinchedan
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో (1) 1. ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగా (2) భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను (2) 2. అక్షయమైనదియు - నిర్మలమైనదియు రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చును 3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్ 4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు 5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి శోధింప నెంతో అశక్యములు - అగమ్యములు 6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా? 7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న మహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి 8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి Pallavi: Santhoshame Santhoshame - Santhoshamutho Sthuthinchedan Kreesthu Yesu Rakshinchinan - Cherchenu Thana Mandalo (1) 1. Ghora Durmaargudanai - Daarithappi Yundagaa (2) Bhoori Dayatho Kaapari Yesu - Daariki Nadipenu (2) 2. Akshayamainadiyu - Nirmalamainadiyu Rakshakudesu Vaadabaarani Svaasthyamu Naa Kichchunu 3. Bhayamemi Ledikanu - Prabhu Chinna Mandaku Daya Krupatho Raajyamivva - Thandrikishtamaayen 4. Manti Purugunaku - Minta Raajyamivva Mintanundi Manti Kethenchi - Marana Monde Nesu 5. Devaa Nee Thalampulu - Naaku Priyamainavi Shodhimpa Nentho Ashakyamulu - Agamyamulu 6. Nijakumaarudesun - Mana Kanugrahinchenu Raajyamutho Baatu Samasthamu Nivva - Venudeeyunaa? 7. Mahima Raajyamunaku - Mimmunu Piluchuchunna Mahima Raajuku Thaginattugaa Meeru - Naduchukonudi 8. Raajaadhiraaju Yese - Prabhula Prabhu Yese Paramandu Doothalu - Yihamandu Narulu Hallelooya Paadudi