సంతసిల్లును మీ హృదయాలు - YouWorship
Santhasillunu Mee Hrudayaalu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సంతసిల్లును మీ హృదయాలు (2) - సీయోను మహిమజూచి (2) 1. సుందర వరుడు యేసు ప్రభువు (2) - సుందరవతి సీయోను (2) శాశ్వత శోభాతిశయముతో (2) - భాసిల్లుటను జూచి (2) 2. నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము 3. నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము 4. జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము 5. స్వర్ణ సమము దాని ప్రజలు - సంతోష సహితులు దూతలే వింతపడునట్లు - ఖ్యాతిని కలిగిన వారు 6. మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు 7. దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్ Pallavi: Santhasillunu Mee Hrudayaalu (2) - Seeyonu Mahimajoochi (2) 1. Sundara Varudu Yesu Prabhuvu (2) - Sundaravathi Seeyonu (2) Shaashvatha Shobhaathishayamutho (2) - Bhaasillutanu Joochi (2) 2. Neelamaya Nithya Punaadulu - Melimi Chhaayaamanulu Sooryakaantha Sugandhamulu - Pushyaraaga Nirmithamu 3. Nithya Mahimatho Veligedu - Muthyaala Gummamulu Svachchhamagu Suvarnamayamu - Aashcharya Nagaramu 4. Jeevavrukshamu Jeevaphalamulu - Jeevaamruthapaanamu Kaanthi Vanthamugaa Meriseti - Vinthalugolpu Nagaramu 5. Svarna Samamu Daani Prajalu - Santhosha Sahithulu Doothale Vinthapadunatlu - Khyaathini Kaligina Vaaru 6. Mandira Samruddhini Vaaru - Thrupthi Nonduchunnaaru Aananda Pravaahamunandu - Paanamu Cheyuchunnaaru 7. Devudu Selavichchinayatti - Devo Kthulalo Nedi Jarugakundaga Poledu - Varusagaa Neraveren