శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను - YouWorship
Shreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను (2) - ఈ కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే (2) 1. మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు (2)- ఈ భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు (2) 2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్ 3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ పావనమగు రక్త ఊట ప్రవహించెన్ 4. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్ 5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము 6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ ధరణికి వేంచేయు కాలము సమీపించెను 7. హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము Pallavi: Shreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu (2) - Ee Kashtalokamandu Manaku Mithru - Daayane (2) 1. Maayakshithini Rakshimpa Vachchina Parama Naayakudu (2)- Ee Bhayangkara Cheekati Pogotta Vachchina Prabhuvu (2) 2. Mundla Kireetamunu Dharinchi Mukhamuna Gottabaden - Aa Gandudongganu Siluvalo Vrelaadi Rakshinchen 3. Heenamaina Eetethoda Prakkana Gruchchabadenu - Aa Paavanamagu Raktha Oota Pravahinchen 4. Moodava Dinamuna Samaadhi Nundi Kartha Lechenu - Thana Thodishishyulu Choochuchunda Naarohanamaayen 5. Jayamu Jayamu Anuchu Neevu Prakatinchumu - Nee Janmamella Yesuni Goorchi Saakshyameeyumu 6. Aarohanamainatlu Marala Vachcheda Nanenu - Ee Dharaniki Vencheyu Kaalamu Sameepinchenu 7. Hallelooya Paaduchu Naarbhaatamuga Naadu - Aa Vallabhudesu Neduta Niluva Naayaththapadumu