శ్రీయేసు నీ పాద - YouWorship
ShreeYesu Nee Paada
Artist: రెవ. జి.టి. మార్టిన్
Category: Praise & Worship
Song Lyrics
శ్రీయేసు నీ పాద - సేవ చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును నా యేసు నీ పాద సేవ చేయుటచే నా ఆయాసములన్నియు - అంతరించును ప్రభువా , యేసు! 1 ఘోర పాపిని నేను - నేరంబులను చేసి దారి తప్పిన ద్రోహిని - కారుణ్యమయుడవే కరుణించి కాపాడి - దారిలో నన్నుంచి దరి చేర్చుము తండ్రి , యేసు! 2. దోసకారిని నేను - దోసంబులజేసి దోసిలొగ్గితి ప్రభువా - దాసుండనో యెసు నాధా నీదయచేత - దోసంబులనుబాప దాసునిగ జే కొనుము , యేసు! 3. సాతాను శక్తులను - సంధించి జయమొంది సంతరిల్లిన యేసువా - నీతోనే నేనుండి నిన్నే సేవించెద - సాతాను నోడింప శక్తి నియ్యుము ప్రభువా , యేసు! 4, శిష్యులను ఆదరించియు అభయమిచ్చిన యేసువా - ఇల నే దీనుడదనయ్య అలముకొని యున్నట్టి - కలుష భారములెల్ల తొలగబేయుము తండ్రి , యేసు! 5. నాదు జీవితమెల్ల - నీదు సేవకే నేను ధారవోయిదు నా ప్రభువా నాధా నారక్షక్రా నా సర్వస్వము నీవే నీ పాద సేవయే - నా జీవితాశయము , యేసు! 6. నీ కొరకే జీవించి - నిన్ను సేవించుచు నీకొరకే మరణింతును - నీకే నా యాత్మను నిజమొప్పనర్పించి నీ సన్నిధిలో నేను నిత్యముందును ప్రభువా , యేసు! 7. ఇదియే నా తుదియాశ - ఇదియే నా తుది కోర్కె ఇదియే నా తుది ఆశయము - హృదయంబు నీ కిత్తు పదిలంబుగ నేను - సదయుండా నిరతంబు అందే నివసింపుము , యేసు! ShreeYesu Nee Paada - Seva Cheyuta Entho Shreyambu Chekoorchunu Naa Yesu Nee Paada Seva Cheyutache Naa Aayaasamulanniyu - Antharinchunu Prabhuvaa , Yesu! 1 Ghora Paapini Nenu - Nerambulanu Chesi Daari Thappina Drohini - Kaarunyamayudave Karuninchi Kaapaadi - Daarilo Nannunchi Dari Cherchumu Thandri , Yesu! 2. Dosakaarini Nenu - Dosambulajesi Dosiloggithi Prabhuvaa - Daasundano Yesu Naadhaa Needayachetha - Dosambulanubaapa Daasuniga Je Konumu , Yesu! 3. Saathaanu Shakthulanu - Sandhinchi Jayamondi Santharillina Yesuvaa - Neethone Nenundi Ninne Sevincheda - Saathaanu Nodimpa Shakthi Niyyumu Prabhuvaa , Yesu! 4, Shishyulanu Aadarinchiyu Abhayamichchina Yesuvaa - Ila Ne Deenudadanayya Alamukoni Yunnatti - Kalusha Bhaaramulella Tholagabeyumu Thandri , Yesu! 5. Naadu Jeevithamella - Needu Sevake Nenu Dhaaravoyidu Naa Prabhuvaa Naadhaa Naarakshakraa Naa Sarvasvamu Neeve Nee Paada Sevaye - Naa Jeevithaashayamu , Yesu! 6. Nee Korake Jeevinchi - Ninnu Sevinchuchu Neekorake Maraninthunu - Neeke Naa Yaathmanu Nijamoppanarpinchi Nee Sannidhilo Nenu Nithyamundunu Prabhuvaa , Yesu! 7. Idiye Naa Thudiyaasha - Idiye Naa Thudi Korke Idiye Naa Thudi Aashayamu - Hrudayambu Nee Kiththu Padilambuga Nenu - Sadayundaa Nirathambu Ande Nivasimpumu , Yesu!