శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో - YouWorship
Shramalanu Ponde Shree Yesudu Nee Korakai Siluvalo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో 1. సదయుడు ప్రేమించె - శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ యెడల - దయచూపించె వహించె నీ శాపం భరించె నీ పాపం నీ మనస్సు మార్చుకొనిన - సంతసించును ప్రభుయేసు 2. దొంగవై నీవున్నా - దురితంబులెన్నున్నా దోషంబుల క్షమియించు - తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు - పరలోక ద్వారము నెమ్మది నిచ్చును నీకు - యేసుని విశ్వసించిన 3. ఎవరేసు రక్తములో - కడుగబడెదరో వారే చేరెదరు - తన సంఘమునందు అంగీకరించుము - యేసును నీవు కలిగించు నీకు తృప్తిని - నేడే నీ వాయనను వేడు 4. సిలువపై యేసు - సర్వ మర్పించె నీ రక్షణ కొరకు - క్రయము చెల్లించె యేసునకు నీవు - ఏమియ్యగలవు? తెరువు నీ హృదయ ద్వారమును - నేడే ప్రవేశించును తాను Pallavi: Shramalanu Ponde Shree Yesudu Nee Korakai Siluvalo 1. Sadayudu Preminche - Shathruvaina Ninnu Doorasthudavaina Nee Yedala - Dayachoopinche Vahinche Nee Shaapan Bharinche Nee Paapan Nee Manassu Maarchukonina - Santhasinchunu PrabhuYesu 2. Donggavai Neevunnaa - Durithambulennunnaa Doshambula Kshamiyinchu - Thana Siluva Rakthamutho Therachenugaa Nee Koraku - Paraloka Dvaaramu Nemmadi Nichchunu Neeku - Yesuni Vishvasinchina 3. Evaresu Rakthamulo - Kadugabadedaro Vaare Cheredaru - Thana Sangghamunandu Anggeekarinchumu - Yesunu Neevu Kaliginchu Neeku Thrupthini - Nede Nee Vaayananu Vedu 4. Siluvapai Yesu - Sarva Marpinche Nee Rakshana Koraku - Krayamu Chellinche Yesunaku Neevu - Emiyyagalavu? Theruvu Nee Hrudaya Dvaaramunu - Nede Praveshinchunu Thaanu