శ్రమయైనా బాధైనా - YouWorship
Shramayainaa Baadhainaa
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Correction
Song Lyrics
శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా|| Shramayainaa Baadhainaa – Himsalenni Edurainaa Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu Khadgame Edurainaa – Shodhanalu Edurainaa Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu Naa Raaju Vachchuchunnaadu – Bheekarudai Vachchuchunnaadu – (2) Sarvonnathudu Meghaarudigaa – Theerpunu Theercha Raanunnaadu Edureleni Kodama Simham – Mahaa Ugrathatho Raanunnaadu Yevaru Yevaru Yevaru Yevaru Yevaru Yevaru Yevaru Yevaru Shouryudu Dheerudu Veerudu Shoorudu Yogyudu Shreshtudu Arhudu Ghanudu Adhbuthakarudu Aascharyakardu – Sarvamu Chesina Srushtikartha Mahonnathudu Maheshwarudu – Sarvamu Gelichina Sarveshvarudu Devaadi Devudu Raajaadhi Raaju – Prabhuvula Prabhuvu Nithya Devudu Vishwasame Naa Balamu – Nithyajeevamu Chepattute Naa Bhaagyamu Shramale Leni Baadhe Leni – Aa Lokamlo Nirantharam Jeevinthunu Vimochakudu Sajeevudu – Naa Kanulaaraa Ne Choochedanu Yugayugamulaku Mahaa Raajunitho – Paalinchutake Poraadedanu O Kraisthavaa Solipokumaa – Theerpu Nundi Nee Aathmanu Thappinchuko Mosapokuma Jaaripokumaa – Nee Rakshanan Jaagratthagaa Kaapaaduko Manchi Poraatam Nuvvu Poraadu – Nee Parugune Kada Muttinchu Vishwaasamunu Kaapadumu – Yesuni Chera Veyyi Mundhadugu ||Shramayainaa||